AP Tourism: పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేషమైన కృషి చేస్తున్నారు. ఏడాది పొడవునా పర్యాటకులను ఆకట్టుకునేలా వినూత్న కార్యక్రమాలతో ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించారు.
ప్రణాళికలు ఇలా..
1. అందమైన సముద్ర తీరాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం.
2. డాల్ఫిన్ షోలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగించడం.
3. గండికోటకు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకోవడం.
4. భవానీ ఐల్యాండ్, హోప్ ఐల్యాండ్ వంటి అన్ని ద్వీపాలను అభివృద్ధి చేయడం.
5. కొండపల్లి, కూచిపూడి, కడియం, మంగళగిరి, చీరాల, బాపట్ల, అరకు వంటి 50 ప్రాంతాల్లో ప్రత్యేక అనుభవ కేంద్రాలను ఏర్పాటు చేయడం.
6. 20 ప్రధాన దేవాలయాల్లో టెంపుల్ టూరిజంను ప్రోత్సహించడం, అలాగే విశాఖ, అమరావతిలో హెల్త్ టూరిజం అభివృద్ధి చేయడం.
7. అమరావతిని ఒక సృజనాత్మక నగర కేంద్రంగా (క్రియేటివ్ సిటీ హబ్) తీర్చిదిద్దడం.
8. అరకు, గండికోటతో సహా 6 ప్రాంతాలలో టెంట్ సిటీస్, సీ-రివర్ క్రూయిజ్ సర్వీసులను ప్రారంభించడం.
9. రాజమండ్రి, విజయవాడ బెర్మ్ పార్క్, సూర్యలంకలో హౌస్ బోట్లను అందుబాటులోకి తీసుకురావడం.
10. రూ.76 కోట్లతో 15 హోటళ్లు, రిసార్ట్‌లను ఆధునీకరించడం, మరో 15 అభివృద్ధి చేయడం.
11. కొత్తగా రోప్‌వేలు ఏర్పాటు చేయడానికి అనువైన 10 ప్రాంతాలను గుర్తించడం.
12. రూ.12,565 కోట్ల పెట్టుబడితో 8,073 గదుల సామర్థ్యం కలిగిన 69 హోటళ్లు, రిసార్టుల ప్రాజెక్టుల కోసం వివిధ సంస్థల ఆసక్తి.
13. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కు పైగా హోమ్‌స్టేలను గుర్తించడం, ప్రత్యేక హోమ్‌స్టే పాలసీని రూపొందించడం.
Read Also-Simhachalam Incident : సింహాచలం ఘటనపై సర్కార్ సంచలన నిర్ణయం.. సీఎం తీవ్ర అసంతృప్తి
ప్రత్యేక కార్యక్రమాలు..
14. 8 మెగా ఈవెంట్స్, 11 నేషనల్ ఫెయిర్స్, 10 ఇంటర్నేషనల్ ఫెయిర్స్ వంటి భారీ స్థాయి కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
15. గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న 500కు పైగా హోమ్‌స్టేలు స్థానిక సంస్కృతిని పరిచయం చేస్తాయి.
16. అరకు కాఫీకి ప్రత్యేక గుర్తింపునిస్తూ 150 ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
17. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఆహారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నారు.
18. పర్యాటక రంగంలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పర్యాటకంతో చేకూరే లాభాలు:
1. స్థానిక సంస్కృతి, కళలకు ప్రోత్సాహం లభిస్తుంది.
2. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
3. రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
4. రాష్ట్ర ఆదాయం వృద్ధి చెందుతుంది.
5. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంది.
Read Also-Earthquake: ఏపీని భయపెట్టిన భూకంపం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..
ఏ ఇజం లేదు.. టూరిజమే ముఖ్యం
ఇవన్నీ చూశాక.. ఒకప్పటి విమర్శకుడు తెలంగాణ కమ్యూనిస్ట్ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఇటీవలే సీఎం చంద్రబాబు పర్యాటక విజన్‌ను ప్రశంసించడం గుర్తుకొస్తున్నాయి. ‘‘ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఏ ఇజం లేదు.. టూరిజమే ముఖ్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అప్పట్లో కోపాన్ని కలిగించినప్పటికీ, పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఖర్చు లేనిది ఏదైనా ఉందంటే అది టూరిజమే’’ అని కూనంనేని అక్కడి సభలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ పర్యాటక రంగ ప్రణాళికలు ఆంధ్రప్రదేశ్‌ను ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాయని, త్వరలోనే ఈ రంగంలో రాష్ట్రం తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు.
Read Also- Barrelakka: ఇష్టం లేకపోయిన పెళ్లి చేసుకున్నా.. సంచలన వీడియో రిలీజ్ చేసిన బర్రెలక్క