Vishaka Metro: విశాఖలో మెట్రోపై ప్రభుత్వం కీలక ముందడుగు!
Vishaka Metro (Image Source: Twitter)
విశాఖపట్నం

Vishaka Metro: విశాఖలో మెట్రో పరుగులు షురూ.. ప్రభుత్వం కీలక ముందడుగు!

Vishaka Metro: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తి కి కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు అహ్వానించింది. ఈ మేరకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు టెండర్లకు సంబంధించి ప్రీ బిడ్ సమావేశాన్ని సైతం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించింది.

విశాఖ మెట్రో కోసం జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి మొత్తం 28 మంది దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. 14 సంస్థలు నేరుగా భేటికి హాజరుకాగా.. వర్చువల్ విధానంలో 8 సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జూన్ 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేసి.. కన్సల్టెన్సీ ని ఎంపిక చేయాలని APMRCL భావిస్తోంది. కన్సల్టెన్సీ ఎంపిక అనంతరం విశాఖలో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి.

కాగా వచ్చే మూడేళ్లలో విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా తాజా సమావేశంతో టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జూన్ 9న సంబంధిత కన్సల్టెన్సీని ఖరారు చేసి.. ప్రాజెక్ట్ పనులు పట్టాలెక్కించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL), కూటమి ప్రభుత్వం భావిస్తున్నాయి.

Also Read: Bandi Sanjay on TG CM: తెలంగాణ పరువు తీశారు.. సీఎం వ్యాఖ్యలు దుర్మార్గం.. బండి ఫైర్

ఇదిలా ఉంటే మెుత్తం 3 కారిడార్లలో విశాఖ మెట్రో రైల్ మెుదటి దశ పనులను చేపట్టనున్నారు. ఈ దశలో మెుత్తం 46 కిలోమీటర్ల మేర.. 42 మెట్రో స్టేషన్లు నిర్మించాలని APMRCL భావిస్తోంది. అటు రెండో దశ పనుల్లో భాగంగా కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 8 కి.మీ మేర నాల్గవ కారిడార్ ను నిర్మించనున్నారు. మెుత్తంగా ఈ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ. రూ.11,498 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా. కేంద్రమే గ్రాంట్ రూపంలో ఈ నిధులు చెల్లిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Also Read This: Chattisgarh Crime: మావోయిస్టుల ఘాతుకం.. గొంతు కోసి ప్రజా ప్రతినిధి దారుణ హత్య..

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం