RTC Strike (imagecredit:twitter)
తెలంగాణ

RTC Strike: మీ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం సిద్దం.. మంత్రి పొన్నం ప్రభాకర్!

RTC Strike: మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆర్టీసీ INTUC కార్మిక సంఘం జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహాం తదితర కార్మిక సంఘం నేతలు భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలను మంత్రికి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని సమ్మె ఆలోచన విరమించుకోవాలని పొన్నం ప్రభాకర్  అన్నారు. సమస్యలను త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమ్మెపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈనెల 7 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే, సమ్మెకు మరో రోజు గడువు ఉండడం ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్, అటు  యాజమాన్యం ప్రకటించగా, జేఏసీ నేతలు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తారా సమ్మెకు వెళ్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమైంది. ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది. ఈనెల ఏడు నుంచి సమ్మెబాటపడుతున్నట్లు ప్రకటించింది. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి సానుకూలత రాలేదని పేర్కొంటూ సమ్మెకు సమాయత్తంలో భాగంగా ఆర్టీసీ కళా భవన్ నుంచి బస్సు వరకు కార్మిక కవాతును జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

Also Read: Transfers In GHMC: జీహెచ్‌ఎంసీ బదిలీలు.. శానిటరీ జవాన్లలో అక్రమార్జన, అవినీతిపై ఆరోపణలు!

ఈ కవాతులో ఈ యూ, టి జే ఎం యు, టీఎంయూ, ఎన్ఎంయు, బి కే యు, బి డబ్ల్యు యు, కే పీ యూనియన్లకు సంబంధించిన నేతలు, కార్మికులు పాల్గొన్నారు. టీఎంయూ, ఎన్ఎంయు, కార్మిక సంఘ్, ఎస్ టి ఏం యు నేతలు కవాతులో పాల్గొన లేదు. దీంతో కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మారడంతో సమ్మె సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా కార్మికుల్లో చర్చనీయాంశమైంది.

ప్రధాన డిమాండ్లు

టిఎస్ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, వేతన సవరణలు చేస్తామని, యూనియన్లను పునరుద్ధరిస్తామని, ఆర్టీసిని అన్నివిధాల అభివృద్ధి చేస్తామని, కొత్త బస్సులు కొనుగోలు. టిజిఎస్ ఆర్టీసిలో ప్రస్తుతం యూనియన్లు లేకపోవడంతో ఎంటిడబ్ల్యు యాక్ట్ అమలు చేయకుండా రోజుకు 16 గంటల వరకు చట్ట వ్యతిరేకంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేయాలని, పెంచిన పనిభారాలను తగ్గించి అన్ని విభాగాలలో ఖాళీలను భర్తీ చేయాలని, బ్రెడ్ విన్నర్ స్కీమ్ లో ఉద్యోగం పొందిన వారికి 3 సంవత్సరాల కాంట్రాక్ట్ పీరియడ్ తీసివేసి రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలని అన్నారు.

సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ లో పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, మహిళా సిబ్బందికి వారికి అవసరమైన సదుపాయుల ను సమకూర్చాలని, రిక్రూట్మెంట్ లేకపోవడంతో, రావలసిన సమయానికి ప్రమోషన్లు రావడం లేదని, దీనితో కొంతమంది రిటైర్ అయ్యే వరకు కూడా అదే పోస్టులో కొనసాగుతున్నారని, గ్యారేజీలో మెకానిక్ లకు అసిస్టెంట్లను ఇచ్చి పనిభారాలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసిలో ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసి యాజమాన్యమే కొనాలని, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులను ఆర్టీసికే ఉపయోగించాలని ప్రధానంగా డిమాండ్ ప్రభుత్వం ముందు పెట్టారు.

Also Read: Employment Guarantee: ఉపాధిహామీ పనుల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్!

జేఏసీ చైర్మన్గా అశ్వద్ధామ రెడ్డి తోపాటు పల సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. వారు సమ్మెలో పాల్గొనడం లేదని ప్రకటించారు. ఆర్టీసీ జాక్ తో మరోవైపు సమ్మెకు కార్మిక సంఘాలు వెళ్తున్నాయి. కార్మిక నేతల మధ్యనే రెండు గ్రూపులు కావడం సమ్మెపై కార్మికుల్లోనే సందిగ్గం నెలకొన్నది. సమ్మెలో పాల్గొంటే ఏమవుతుంది పాల్గొనకపోతే ఏం జరుగుతుంది సమ్మెలో పాల్గొన్న సిబ్బందిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని మరోవైపు మీ మాంసను వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ యాజమాన్యం చేయటం సమ్మె చేయడం నేరమని పేర్కొంది. సంస్థలో సమ్మెలో నిషిద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వం కార్మిక సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. అయితే సమ్మెకు మరో రోజు గడువు ఉండడంతో కార్మిక సంఘాలు ప్రభుత్వంతో చర్చిస్తాయా లేకుంటే సమ్మెకు వెళ్తాయా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?