Employment Guarantee (imagecredit:twitter)
తెలంగాణ

Employment Guarantee: ఉపాధి హామీ పనుల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్!

Employment Guarantee: ఉపాధి హామీ పనుల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. సంవత్సరంలో 330 రోజులు ఉపాధి కల్పించనుంది. ఆ రోజుల్లో ఏయే పనులు నిర్వహించాలి? ఎవరెవరికి పనులు అప్పగించాలని అధికారులకు ప్రణాళికను అందజేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో 6.50 కోట్ల పనులు చేయాలని కేంద్రం సిగ్నల్ ఇచ్చింది.

ఉపాధిహామీ పథకంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణ లక్ష్యంగా కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి కూలీల బడ్జెట్‌, పని దినాలను రూపకల్పన చేసింది. ఈ సారి రాష్ట్రంలో 6.50 కోట్ల (వ్యక్తి రోజులు) పనులకు బడ్జెట్‌ను కేటాయించింది.

330 రకాల పనుల కోసం రూ.2,708 కోట్లు నిధులు మంజూరు చేసింది. జిల్లాల్లో అన్ని స్థాయిల్లో పనుల గుర్తింపు, గ్రామసభలు నిర్వహించి పనులను ఆమోదించాల్సి ఉంటుంది. ఆపనులకు ఆమోదం తెలుపగానే వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, డీఆర్డీవోలకు డైరెక్టర్​ సృజన ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అందుకు గ్రామస్థాయిలోని అధికారులను సైతం సన్నద్ధం చేస్తున్నారు.

Also Read: Mahesh Kumar Goud: మన్మోహన్ సింగ్ ఫెలోషిప్.. యువతకు మంచి అవకాశం!

రాష్ట్రంలో 32 జిల్లాలు ఉండగా.. 31 జిల్లాలోనే ఉపాధి పనులు చేపట్టనున్నారు. మేడ్చల్​ జిల్లాలోని గ్రామాలు ఫ్యూచర్​ సిటీలో కలవడంతో ఉపాధి పనులకు అవకాశం కోల్పోయింది. దీంతో ఆ జిల్లా కూలీలకు ఉపాధి పనులు లేవని ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ లో పేర్కొంది. గతంలో ఉపాధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పాత విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉపాధి పనులపై సామాజిక తనిఖీలతో కేంద్రం, పూర్తిగా నిఘా పెంచింది. ఇప్పటికే నేషనల్‌ ఇన్‌ఫర్మెటిక్‌ సెంటర్‌ ఎన్‌ఐసీ సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధిహామీ కూలీలకు వారి ఖాతాల్లోనే నేరుగా కూలీ డబ్బులను జమ చేస్తోంది.

ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసాలో భాగంగా పశువుల కొట్టాలు, అజోలా సాగు గుంటలు, కంపోస్ట్​ గుంటలు, పౌల్ట్రీషెడ్ మదర్ యూనిట్లు, పొలంబాటలో భాగంగా వ్యవసాయ క్షేత్రాలకు రోడ్ల నిర్మాణం, హార్టికల్చర్ -వనమహోత్సవంలో భాగంగా నర్సరీల స్థాపన, ఈత, తాటి ప్లాంటేషన్, నర్సరీలు, బండ్ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, హోమ్‌స్టెడ్ ప్లాంటేషన్లు, హార్టికల్చర్ తోటలు, గల్లీ నియంత్రణ పనులు, జలనిధిలో భాగంగా చెక్ డ్యామ్‌లుచేయనున్నారు.

నీటి కందకాలు, పెర్కోలేషన్ ట్యాంకులు, ఫామ్ పాండ్లు, నీటిపారుదల ఓపెన్ వెల్స్, బోర్ వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, కమ్యూనిటీ ఫిష్ పాండ్‌లు, కొత్త నీటిపారుదల కాలువలు, డ్రెయిన్లు, వ్యక్తిగత సోక్ పిట్స్, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా పాఠశాల మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణంతోపాటు వ్యవసాయ, అనుబంధ పనులు చేపట్టనున్నారు.

పనుల్లో అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఉదయం సాయంత్రం వేలలో పనులు చేసే టప్పుడు కూలీల వివరాలను ఎప్పటికప్పడు అప్ లోడ్ చేయాలని ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది. పనుల్లో నాణ్యత సైతం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవకతవకలు ఎవరైనా పాల్పడితే చర్యలకు సిద్ధమవుతున్నారు.

Also Read: Miss World 2025: ప్రపంచ సుందరులు వచ్చారు.. ప్రజలకు మాత్రం ఎల్ఈడీ స్క్రీన్‌ పరిమితం?

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?