Chai, Sobhita and Samantha
ఎంటర్‌టైన్మెంట్

Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుందా? అక్కినేని మరో తరం దిగబోతుందా?

Samantha and Sobhita: సమంత ఇవ్వలేనిది.. చైతూకి శోభిత ఇస్తుంది.. అంటూ రెండు మూడు రోజులుగా మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అవును, త్వరలో అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) మరో తరం దిగబోతుంది అని, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ రకరకాలుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రీసెంట్‌గా జరిగిన వేవ్స్ 2025 వేడుకలో నాగ చైతన్య భార్య, హీరోయిన్ శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) నిండైన చీరకట్టులో కనిపించింది. అంతే అప్పటి నుంచి ఈ విధంగా వార్తలు మొదలయ్యాయి.

Also Read- Peddi First Shot: ‘పెద్ది ఫస్ట్ షాట్’ రీ క్రియేట్.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్‌పై ‘పెద్ది’ టీమ్ ప్రశంసలు

శోభిత తల్లి కాబోతుంది, అందుకే ఇలా చీరకట్టులో తను గర్భాన్ని దాచే ప్రయత్నం చేసిందనేలా టాక్ మొదలైంది. గతేడాది డిసెంబర్‌లో నాగ చైతన్య (Naga Chaitanya), శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. పెళ్లయిన ఆరు నెలల తర్వాత, పిల్లల గురించి ఆలోచించాలని ఇద్దరూ అనుకున్నారని, అందుకే వారు మొదటి బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటున్నారని.. వాళ్ల ఇంట్లో నుంచి చూసినట్టే వార్తలు పుట్టించేస్తున్నారు. ఈ వార్తలు ఇలా పుట్టించడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ‘తండేల్’ సక్సెస్ తర్వాత చైతూ, శోభిత హనీమూన్ వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. అలాగే శోభిత అలా చీరలో కనిపించడంతో అంతా అలా వార్తలు అల్లేస్తున్నారు.

ఇంకొందరైతే సమంత (Samantha)తో నాగ చైతన్య విడిపోవడానికి కారణం చైతూ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని కోరడమే అనేలా కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకునే సమయానికి సమంత మయోసైటీస్‌తో బాధపడటం, ఆ సమయంలో పిల్లలు అంటే చాలా ఇబ్బంది పడాలని చెప్పడం వల్లే.. వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయని, అందుకే ఇద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్ వినబడుతుంది. వాస్తవానికి సమంతకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు తల్లిగా ప్రమోషన్ వస్తుందా? అని ‘శాకుంతలం’ సినిమాకు సైన్ చేసే ముందే తను ఫ్యామిలీ‌ని రెడీ చేసుకోవాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి.

Also Read- Singer Pravasthi: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ ప్రవస్తి.. ఒక్క దెబ్బకి అందరికీ ఇచ్చిపడేసిందిగా..!

కానీ ఏం జరిగిందో ఏమో కానీ, సడెన్‌గా వారిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నాగ చైతన్య కూడా ఇటీవల రానా హోస్ట్ చేసిన ఓ షో లో మాట్లాడుతూ.. వెంకీ మామలా పెద్ద ఫ్యామిలీ కాకుండా, ఇద్దరు పిల్లలు కావాలని కోరుకుంటున్నానని అన్నారు. 50 ఏళ్ల వయస్సులో జీవితం ఎలా ఉండాలని రానా అడిగిన ప్రశ్నకు చైతూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఆ మాటలను బట్టి చూస్తే, చైతూ ఫ్యామిలీని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లుగా అంతా భావించారు. అందుకే ఇలా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వార్తలపై శోభిత రియాక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. చీరకట్టుకుని వస్తే.. ప్రెగ్నెన్సీ అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? కొంచమైనా సెన్స్ ఉందా? అంటూ, ఓ ఇంటర్వ్యూలో రూమర్స్‌పై ఫైర్ అయినట్లుగా సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!