Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్‌గా ఉంటుంది. హస్తం పార్టీ భావాజలంలో లౌకికత్వం కీలకమైంది. పరమత సహనాన్ని తప్పకుండా పాటిస్తుంది. కానీ, కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టేనా? అనే చర్చ జరిగింది. పరమత సహనాన్ని నిజంగా కాంగ్రెస్ పాటిస్తున్నదా? అనే ప్రశ్నలూ వచ్చాయి. ఈ వాదనలను, ప్రశ్నలను హస్తం పార్టీ నాయకులు స్వయంగా సమాధానాలు చెప్పారు. అయినా.. అప్పుడప్పుడు ఈ చర్చ ముందుకు వస్తూ ఉంటుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని, పరమత సహనం కలిగిన పార్టీ అని చెప్పడానికి ఒక సాక్ష్యంగా శుక్రవారం ఓ ఘటన జరిగింది.
సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌లో చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వంశీచంద్ రెడ్డి కూడా మాట్లాడారు. వంశీచంద్ రెడ్డి మాట్లాడుతుండగా ఓ అనూహ్య ఘటన జరిగింది. ర్యాలీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి వాహనంపై నిలబడి ఉన్నారు. వంశీచంద్ రెడ్డి మాట్లాడుతుండగా.. సమీపంలోని ఓ మసీదు నుంచి నమాజ్ ప్రార్థన మైక్‌లలో వినిపించింది. నీరు తాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అలర్ట్ అయ్యారు. వంశీచంద్ రెడ్డికి సైగ చేశారు. ప్రసంగాన్ని ఆపాల్సిందిగా సూచన చేశారు. వెంటనే వంశీచంద్ రెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు. ఆ ర్యాలీ అంతా కూడా నిశబ్దం కమ్ముకుంది. ఏమైందా అని అందరూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. అప్పుడు మైక్‌లో నుంచి నమాజ్ ప్రార్థన వినిపించింది. నమాజ్ ముగిసే వరకు వెయిట్ చేశారు.
నమాజ్ కోసం స్పీచ్ ఆపించిన సీఎం
మహబూబ్ నగర్ లో చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ర్యాలీ. నమాజ్ సమయం కావడంతో వంశీచంద్ స్పీచ్ ని ఆపించిన సీఎం రేవంత్ రెడ్డి#telangana #Elections2024 #Congress #NewsUpdates #bigtv pic.twitter.com/5uWhZ5XAw6
— BIG TV Breaking News (@bigtvtelugu) April 19, 2024
Also Read: తమిళనాడు దోసె, కేరళ దోసె వేరండీ.. రాహుల్ గాంధీ ఏం చెప్పదలిచారు?
ఈ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కింది. పరమత సహనానికి ఇది సజీవ సాక్ష్యం అని నెటిజన్లు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పడానికి ఇదే ప్రూఫ్ అని చెబుతున్నారు. తమ మతాన్ని పాటిస్తూనే ఎదుటి మతాన్ని కూడా గౌరవించడమే లౌకికత్వంలోని ప్రధాన అంతస్సూత్రం అని వివరిస్తున్నారు. కొన్ని పార్టీలు విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరమత సహనాన్ని పాటించడం హర్షణీయం అని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.