Dilip Devgan and Janulyri
ఎంటర్‌టైన్మెంట్

Dilip Devgan and Janulyri: పెళ్లి చేసుకోబోతున్నాం.. ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేశారు

Dilip Devgan and Janulyri: ఫోక్ సాంగ్స్‌‌కు తనదైన తరహాలో డ్యాన్స్ చేస్తూ డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు పొందిన జాను లిరీకి సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు హైలెట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె శుక్రవారం ఏడుస్తూ పెట్టిన ఒక వీడియో బీభత్సంగా జనాల్లోకి వెళ్లిపోయింది. పెళ్లి అనంతరం తన భర్త వదిలేసినా, ఉన్న ఒక్క బిడ్డని ప్రయోజకుడిని చేయాలని ఎన్నో కలలు కంటున్న జాను.. ఈ మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలతో తనపై విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. కొందరు నెటిజన్లు తనని అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేయడాన్ని జాను తట్టుకోలేకపోయింది. ఈ విషయాన్ని చెబుతూ శుక్రవారం ఆమె చేసిన సెల్ఫీ వీడియో దుమారాన్ని రేపింది.

Also Read- Bunny Vas: అల్లు అర్జున్ టీ షర్ట్‌పై జర్నలిస్ట్ కామెంట్.. బన్నీ వాసు కౌంటర్!

కారణం, ఆ వీడియోలో ఇక ఈ భూమ్మీద నాకు బతకాలని లేదు. ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలపడమే. ‘‘నేను ఎవరితో మాట్లాడినా, వారితో లింక్ పెట్టేస్తున్నారు. అది చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది. ఈ ట్రోలింగ్ చూస్తుంటే నాకు బతకాలని లేదు. నాకు రెండో పెళ్లి అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. పిచ్చిపిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు. మాట్లాడితే చాలు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ యూట్యూబ్స్‌లో అడ్డదిడ్డంగా థంబ్స్ రాసి పెడుతున్నారు. మీకు నా పెళ్లి తప్పితే వేరే టాపిక్ లేదా? నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? మీరు నా గురించి చెప్పాలనుకుంటే, నేను చేసిన మంచి పనుల్ని చెప్పండి. ఢీ షోలో విన్నర్‌గా గెలిచాను. ఒక బాబుని పెంచుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా అది చేసింది, ఇది చేసింది అంటూ నాపై లేని పోనివి రాస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది.

ఈ వీడియో చేసిన తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో అందరూ కంగారు పడ్డారు. నిజంగానే ఆమె చెప్పినట్లుగా ఏమైనా చేసుకుందా? అని అంతా భయాందోళనలకు గురవుతున్న సమయంలో.. జాను మళ్లీ మరో వీడియోతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే ఈసారి ధైర్యంగా తన రెండో పెళ్లిని కన్ఫర్మ్ చేసింది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ సారీ చెబుతున్నాను. నిన్న నేను చేసిన వీడియో చూసి చాలా మంది బాధపడ్డారు. చాలా మంది రియాక్ట్ అయ్యారు. చాలా మంది సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

చాలా రోజుల నుంచి కొన్ని చూస్తూ ఉన్నా. వాటిని చూసి బాధనిపించే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. నా ఫ్యామిలీ నా గురించి బాధపడుతుందని అనుకుంటూ అలా అయిపోయాను. నిజంగా నేను బాధపడే అమ్మాయిని కాదు. చాలా స్ట్రాంగ్ గాళ్‌ని అని మీ అందరికీ తెలుసు. అందరూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లితో మీకేంటి ప్రాబ్లమ్? అవును, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నా కొడుకు, నేను సంతోషంగా ఉండి, ఆ సంతోషంతోనే మీ అందరికీ ఆన్సర్ ఇస్తా. నిన్నటి వీడియోను కూడా కొందరు చెడుగా తీసుకున్నారు. ఈ ట్రోలింగ్ ఎప్పటికీ ఆగదని నాకు అర్థమైంది. ఇక దానిని పట్టించుకోను. నా లైఫ్‌లో నేను స్ట్రాంగ్‌గా ఉంటా. ఇంకా ముందుకు వెళుతూనే ఉంటా. నేను ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉంటా. థ్యాంక్యూ’’ అని చెప్పుకొచ్చింది.

Also Read- Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

మరో వైపు జానుని పెళ్లి చేసుకోబోతున్నానని సింగర్ దిలీప్ దేవ్‌గన్ కూడా ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన ఈ వీడియోలో మాట్లాడుతూ.. ‘‘ముందుగా నా పాటలను ఆదరించి, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రేక్షకదేవుళ్లకి, మీడియా మిత్రులకు నమస్కారం. నేను రీసెంట్‌గా ఏదైతే ఫొటోని పోస్ట్ చేశానో, దానిపై విపరీతంగా ట్రోల్ చేశారు. అవునండి.. అది నిజమే. నేను, జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. మేము ఇష్టపడ్డాం. కలిసి బతకాలని అనుకుంటున్నాం. మేము ఎట్లాంటి తప్పు చేయలేదు.

మేము కలిసి బతకాలని అనుకుంటున్నాం అంతే. అందుకు మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. వాళ్లింట్లోనూ ఒప్పుకున్నారు. మేమిద్దరం ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోబోతున్నాం. అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు మీడియాలో సైతం అంటున్నారు. మళ్లీ చెబుతున్నాను.. మేము ఎలాంటి తప్పు చేయలేదు. ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా, తట్టుకుని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో.. వారందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్యూ సో మచ్..’’ అని వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు