Bunny Vas: ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)లో బీభత్సమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా, తన పక్కన అతి తక్కువ మంది మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్‌గా బన్నీ కనిపించిన ప్రతి చోటా.. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సింపుల్‌గా ఉంటున్నాడు. రెగ్యులర్‌గా ఆయన పక్కన ఉండేవారు కూడా పెద్దగా కనిపించడం లేదు. అలాగే ఆయన వచ్చి, వెళ్లే ఫంక్షన్లకు సంబంధించిన సమాచారం కూడా ముందుగా ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఇదంతా చూస్తుంటే, సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్‌ని ఎంత బాధపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఇక విషయంలోకి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ పబ్లిక్‌లో కనిపించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతుంది.
Also Read- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సారీ చెప్పాడు.. కేసు వెనక్కి తీసుకుంటారా?
ఈ వీడియోలో నుంచి ఒక ఫొటోని తీసి, నిత్యం సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ అంటూ హడావుడి చేసే ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేశారు. ఈ ఫొటోకి ఆయన.. ‘సోషల్ మీడియా అటెన్షన్ ఎలా తెచ్చుకోవాలో అల్లు అర్జున్‌కు బాగా తెలుసు.. మీరేమంటారు? కామెంట్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. అంతే నెటిజన్లు కొందరు సీరియస్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కి అల్లు అర్జున్ ప్రాణ స్నేహితుడు, నిర్మాత బన్నీ వాస్ కౌంటర్ ఇస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది. బన్నీ వాస్ తన పోస్ట్‌లో..
‘‘ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం వంటి ఒక హాస్య నటుడిపై బన్నీ తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడుపై బన్నీ ప్రేమ మీకు కనిపించలేదా..? మీ దృష్టిలో బ్రహ్మానందంని బన్నీ హైలైట్ చేసిన పాజిటివ్ కోణం మీకు కనబడలేదు కానీ, అందులో ఇలాంటి కోణం ఒకటి వెతికారు.
Dear @sairaaj44 గారు
ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు మీద ఇలాంటి లాజిక్ అప్లై చేస్తారా..? అక్కడ తన అభిమాన హాస్యనటుడు పై బన్నీ గారి ప్రేమ… https://t.co/vGOfVo2Jr1
— Bunny Vas (@TheBunnyVas) May 3, 2025
వీలైతే గొడవలు ఆపుదాం.. మంచి విషయాలను పాజిటివ్‌గా చెబుదాం. నాకు స్ఫూర్తినిచ్చిన మనిషి చిరంజీవి అంకుల్ అంటూ జాతీయ వేదికపై నిన్ననే బన్నీ చాలా బాగా మాట్లాడారు. ఆ వీడియో మీ నాలెడ్జ్‌లోకి రాలేదనుకుంటా.. అలాంటివి మీరు పట్టించుకోరు. అలాంటి వాటిని హైలెట్ చేస్తే మనసులో మాట కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇటువంటివి రాస్తే కాస్త మంచి జరుగుతుంది. ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు?’’ అని బన్నీ వాస్ ప్రశ్నించారు. దీనికి సదరు జర్నలిస్ట్ ఏదో సమాధానం ఇచ్చాడనుకోండి. అదే వేరే విషయం.
Also Read- Tollywood Actress: సినీ ఇండస్ట్రీలో వరుసగా 7 ప్లాపులు అందుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
అసలు బన్నీ వేసుకున్న టీ షర్ట్‌పై ఏముందంటే.. బ్రహ్మానందం (Brahmanandam) నెల్లూరు పెద్దారెడ్డి అనే చెప్పే డైలాగ్‌తో పాటు, ఆ సన్నివేశంలో బ్రహ్మానందం ఇచ్చే రెండు ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఫొటో ఉంది. అలాంటి టీ షర్ట్‌ని బన్నీ ఎందుకు వేసుకుని, పబ్లిక్‌లోకి వచ్చాడు? అని సదరు జర్నలిస్ట్ మాత్రమే కాదు.. చాలా మంది నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై కొన్ని మీమ్స్ కూడా వదులుతున్నారు. దీనిపై అనవసరంగా స్పందించి.. పబ్లిక్‌లోకి ఈ మ్యాటర్ మరింతగా చొచ్చుకుపోయేలా బన్నీ వాస్ చేశారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు