Bhatti Vikramarka (Image Source: Twitter)
తెలంగాణ

Bhatti Vikramarka: కేంద్రం తలొగ్గింది.. ఇది సమిష్టి విజయం.. డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: దేశంలో కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ ప్రజా ప్రభుత్వ విజయమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)  అన్నారు. ఖమ్మం జిల్లాలో బీసీ నేతల సన్మానం అందుకున్న అందుకున్న అనంతరం భట్టి మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ (Sonia Gandhi) ఆదేశాల మేరకు తెలంగాణలో కులగణన సర్వే (Cast Census) చేపట్టినట్లు చెప్పారు. దీనిపై పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావడంతో కేంద్రం తలొగ్గినట్లు పేర్కొన్నారు.

1930 తర్వాత దేశంలో కులగణన జరగలేదన్న భట్టి.. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మాత్రమే కులగణన చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించడం క్లిష్టమైన సమస్య అయినప్పటికీ 50 నుంచి 55 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు చెప్పారు. 150 ఇళ్లను ఒక బ్లాక్ గా ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా కులగణన  సర్వే చేపట్టామని వివరించారు. పది బ్లాకులకు ఒక సూపర్వైజర్, మండల జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్లు, జిల్లా కలెక్టర్ పగడ్బందీగా సర్వే చేశారని అన్నారు.

Also Read: YS Sharmila On Amaravati 2.0: నాడు మట్టి – నేడు సున్నం.. అమరావతి సభపై షర్మిల ఫైర్!

రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని లెక్కలు తేల్చడంతో పాటు స్థానిక సంస్థలు, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు భట్టి చెప్పారు. ఖర్గే, రాహుల్, రేవంత్ రెడ్డి సమిష్టి పోరాట ఫలితంగా కేంద్రం దిగొచ్చి కులగణన సర్వే అంగీకరించిందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన సర్వే ద్వారా వచ్చే ఫలితాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలని భట్టీ కోరారు. బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా యావత్ మంత్రిమండలి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు భట్టి అన్నారు.

Also Read This: New Rule for Uber Ola Rapido: క్యాబ్ సేవల్లో కొత్త రూల్స్.. 25% డిస్కౌంట్లు.. డ్రైవరే డబ్బు ఇవ్వాలి!

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!