- కాంకేర్ ఘటనలో 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన లక్ష్మణ్
- 17 సంవత్సరాల సర్వీసులో 44 మంది నక్సల్స్ హతం
- ఇప్పటిదాకా ఆరు సార్లు వరించిన శౌర్య పురస్కారం
- సాధారణ కానిస్టేబుల్ నుంచి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎదిగిన లక్ష్మణ్
- కెరీర్ లో ఎన్నో రిస్కులు, ఎన్నో భయానక ఘటనలు
- ఛత్తీస్ గడ్ లో నక్సల్స్ కదలికలు పసిగట్టడంలో దిట్ట
- పక్కా ప్లానింగ్ తో చేసే యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు
- ఇంతవరకూ లక్ష్మణ్ టీమ్ సభ్యులెవ్వరూ మరణించలేదు
- పోలీసు శాఖలో మంచి ట్రాక్ రికార్డు కలిగిన హీరో
Chattisgadh Naxils Specialist Kevath Lakshman:డ్యూటీ కోసం ప్రాణం పెట్టే పోలీసతడు..రిస్క్ అని తెలిసినా అంతు చూసేదాకా వదలడు. నక్సల్స్ పాలిట యముడు. 44 మంది కరుడుకట్టిన నక్సల్స్ ను కాల్చిచంపిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్…మొన్నటి కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన ఆపరేషన్ కు ఈయనే లీడర్. అంతేకాదు ఈ యాంటీ నక్సల్ మిషన్ వ్యూహకర్త కూడా అతనే..కేవత్ లక్ష్మణ్. వందకు పైగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొన్న ధీశాలి. 17 సంవత్సరాల తన సర్వీసులో ఆరుసార్లు పోలీసు పురస్కారాన్ని అందుకున్నాడు. మామూలుగా ఒక్కసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే చాలా గొప్ప అలాంటిది ఇన్నిసార్లు అందుకున్న లక్ష్మణ్ మామూలు పోలీసు కాదు.
సాధారణ కానిస్టేబుల్ గా చేరి..
లక్ష్మణ్ 2007 లో ఛత్తీస్ గఢ్ పోలీసు డిపార్ట్ మెంట్ లో ఓ సాధారణ కానిస్టేబుల్ గా చేరాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఐదేళ్లకు ఎస్ ఐ గా ప్రమోట్ అయ్యాడు. డ్యూటీ లో భాగంగా అనేక సమస్యాత్మక ప్రాంతాలలో ఎలాంటి జంకూ లేకుండా పనిచేశాడు. ఇప్పుడు కఖంజార్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జిగా , డీఆర్జీ ఇన్ ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
లిబరేషన్ జోన్ లో లైగర్
కొటారీ నదికి అవతలి వైపు ఉండే కొండ ప్రాంతాన్ని మావోయిస్టుల ‘లిబరేషన్’ జోన్‌గా పిలుస్తారు. వారికి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు పెద్దసంఖ్యలో సమావేశమైనట్లు సమాచారం రాగానే ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు లక్ష్మణ్ టీమ్. 200 మంది భద్రతా సిబ్బందితో అతి కష్టమ్మీద అక్కడికి చేరుకున్నారు. ఉదయం మావోయిస్టులపై మెరుపుదాడి చేయాలని ప్రయత్నించినప్పుడు.. మావోయిస్టు సంఘ సభ్యుడు ఒకరు బాంబులు పేల్చి అగ్రనాయకులకు హెచ్చరికలు జారీచేశాడు. ఫలితంగా లక్హణ్ టీమ్ కొన్ని గంటలపాటు అక్కడే దాక్కోవాల్సి వచ్చింది. మావోయిస్టు క్యాంపునకు 300 మీటర్ల సమీపానికి చేరుకున్న తర్వాత వీళ్ల కదలికలను నక్సల్స్ పసిగట్టకుండా ఉండేందుకు పాకుతూ వెళ్లారు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ ప్రాంతాన్ని అష్టదిగ్బంధం చేశారు. అయినా పోలీసు టీమ్ రాకను తెలుసుకొని కాల్పులు ఆరంభించారు నక్సల్స్. అంతే ఎదురుకాల్పులకు దిగారు లక్ష్మణ్ టీమ్. పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్ కౌంటర్లు చేస్తాడు లక్ష్మణ్. హెలికాప్టర్‌ను సైతం ఎక్కడ ల్యాండ్ చేయాలో కూడా ముందే చూసుకుంటాడు. దట్టమైన అడవిలో రాత్రి సమయంలో బస చేయాల్సి వస్తే అందుబాటులో ఉన్న ఆహారపదార్థాలు, వైద్య సదుపాయాలపై ముందుగానే ఓ అంచనాకు వస్తారు వీళ్ల టీమ్ . కొన్ని కొన్ని సార్లు ప్రాణాలను పణంగా పెట్టి నదులు, వాగులు దాటుకుంటూ ఆపరేషన్ నిర్వహించేవారు. వేసవి కాలంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని, మావోయిస్టులు నీటి కోసం వచ్చే సమయంలో మాటు వేసి అవసరమైతే వారిపై దాడులు చేస్తారు.
ఎక్కడ డ్యూటీ చేసినా భయపడడు
అంతకు ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులను అంతమొందించాడు లక్ష్మణ్.. అప్పటి నుంచి మావోయిస్టులు లక్ష్హణ్ ను టార్గెట్ చేశారు. ఈ విషయం సీనియర్ అధికారులకు తెలియడంతో భద్రత దృష్ట్యా లక్ష్మణ్ అక్కడి నుండి బదిలీ చేశారు. అక్కడ బీజాపూర్‌లో 2016 నుంచి 2018 వరకు విధులు నిర్వహించాడు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 10 ఏళ్లుగా ఉంటూ 100కి పైగా ఎన్‌కౌంటర్లలో పాల్గొనడం విశేషం. విచిత్రం ఏమిటంటే ఇంతమంది మరణించినా లక్ష్మణ్ టీమ్‌లోని ఒక్క పోలీసు కూడా ఏ ఎన్‌కౌంటర్‌లోనూ మరణించలేదు. వారికి కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి.