Megastar Chiranjeevi in Vishwambhara
ఎంటర్‌టైన్మెంట్

Vishwambhara: ‘విశ్వంభర’ పెన్‌డ్రైవ్‌లు వస్తున్నాయ్.. అందులో ఏముందంటే?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట (Vassishta) కాంబినేషన్‌లో యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటిగా చెప్పబడుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు. వాస్తవానికి, ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ కూడా పూర్తయిందని ఆ మధ్య మేకర్స్ చెప్పారు. కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అప్డేట్స్ కావాలని రచ్చరచ్చ చేస్తుంటే, ఇటీవలే ఈ చిత్రాలోని ‘రామ రామ’ అనే లిరికల్ సాంగ్‌ని హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు. అంతే, ఆ తర్వాత మళ్లీ సౌండ్ లేదు.

Also Read- Vijay Deverakonda: ఆ మాటకు విజయ్ దేవరకొండపై కేసు నమోదు.. బాగా ఇరుక్కున్నాడు!

పైకి సౌండ్ లేకపోయినా, గ్రౌండ్‌లో మాత్రం మేకర్స్ ఈ చిత్ర పబ్లిసిటీ కోసం భారీ స్కెచ్‌లే వేస్తున్నట్లుగా తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఈ వీడియోలో అన్నీ పెన్‌డ్రైవ్‌లే కనిపిస్తున్నాయి. విషయం ఏమింటంటే.. రీసెంట్‌గా విడుదలైన ఈ పాటని పెన్‌డ్రైవ్‌లో స్టోర్ చేసి.. తెలుగు రాష్ట్రాలలో ఉన్న శ్రీరాముడి, అలాగే హనుమాన్ టెంపుల్స్‌లోని పూజారులకు కానుకగా ఇవ్వనున్నారట. ఈ పాట విడుదలైన వెంటనే మంచి స్పందనను రాబట్టుకోవడంతో పాటు, విడుదలైన రోజుకు కూడా విశిష్టత ఉండటంతో వెంటనే వైరల్ అయింది. ఇప్పుడీ పాటను అన్ని రామ, హనుమాన్ టెంపుల్స్‌లో వినిపించడమంటే, అటు భక్తితో పాటు.. ఇటు చిత్ర పబ్లిసిటీకి కూడా ఉపయోగపడుతుందని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఈ వీడియోలో ఈ పెన్‌డ్రైవ్‌ల ప్యాకింగ్ చూస్తుంటే చూడముచ్చటేస్తుంది. అసలీ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ, చాలా మంచి ఐడియా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ వీడియోతో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసినట్లుగా ఓ క్లారిటీ ఇచ్చారు సరే, మరి విడుదల తేదీ ఎప్పుడో చెబితే.. మా పనుల్లో మేముంటామని అంటున్నారు మెగా ఫ్యాన్స్. మరో వైపు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేయబోతున్న అనిల్ రావిపూడి చిత్రానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి పక్కా స్కెచ్‌తో సినిమాను చిత్రీకరించి, రాబోయే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోకి తీసుకురావాలనే ధ్యేయంగా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Uppal Balu: హల్దీ ఫంక్షన్ చేసుకుంటున్న ఉప్పల్ బాలు.. షాక్ లో ఫ్యాన్స్!

కానీ, ‘విశ్వంభర’ విషయంలోని ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్‌గా ఉన్నారు. ఆ మధ్య వచ్చిన టీజర్‌లో విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయనే కంప్లయింట్ అభిమానుల నుంచి కూడా వచ్చింది. అందుకే అన్నీ జాగ్రత్తగా సెట్ చేసుకుని దిగాలని చిరు, వశిష్ట భావిస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్‌లో అనుకుంటున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?