Uppal Balu: ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే లేడీ అఘోరి గురించి మాట్లాడుతూ చాలా ఫేమస్ అయ్యాడు. అఘోరి గురించి రోజుకొక వీడియో షేర్ చేస్తూ జనాల్లో పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. అఘోరి అమ్మ గురించి మాట్లాడిన వీడియోస్ మొత్తం మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈవెంట్స్, షోస్ కి అటెండ్ అవుతూ .. మధ్య మధ్య లో యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, తాజాగా ఉప్పల్ బాలు హల్దీ ఫంక్షన్ లో సందడీ చేసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఉప్పల్ బాలు అప్పుడప్పుడు చీర కూడా కడుతూ ఉంటాడు. అలా చీర కట్టిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటాడు. ఇక నెటిజన్స్, ఫ్యాన్స్ అయితే ఇతని వేసే డ్యాన్స్ లు చూసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంత ఫేమస్ అయ్యి బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేయలేదని అడిగితే.. దానికి ఉప్పల్ బాలు చెప్పిన సమాధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నాకు పని లేకపోతే నాలుగు ఇళ్ళు ఊడ్చుకుంటూ అయిన బతుకుతా కానీ, ప్రజల ప్రాణాలతో ఆడుకునే గేమ్స్ ను అస్సలు ఎంకరేజ్ చేయను అని చెప్పాడు. ఉప్పల్ బాలు ఇంత వరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదని.. అతనిలో అది నచ్చిందని మెచ్చి నా అన్వేషణ అన్వేష్ ఏకంగా ఐఫోన్ ను గిఫ్ట్ గా పంపించాడు. ఇదిలా ఉండగా ఉప్పల్ బాలు హల్దీ ఫంక్షన్ లో పూలతో ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ సందడీ చేశాడు.
Also Read: Man Hulchul Hyderabad: పోలీస్ బాస్ ఫోన్ నెంబర్ తో వ్యక్తి హల్చల్.. కేసు నమోదు!
దీని పై రియాక్ట్ అయిన ఫ్యాన్స్ ఆ పెళ్లి చేసిన తర్వాత నువ్వు కూడా చేసుకో అని సలహా ఇస్తున్నారు. ఇంకొందరు, పెళ్లి కుదిరిందా అమ్మాయి ఎవరని అడుగుతున్నారు. చీరలో చాలా బాగున్నావ్ బాలు అని , మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు