Beerla Ilaiah On Kavitha (imagecredit:twitter)
తెలంగాణ

Beerla Ilaiah On Kavitha: పంది కొక్కుల్లా పది ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు.. బీర్ల అయిలయ్య!

Beerla Ilaiah On Kavitha: కల్వకుంట్ల కవిత కు తెలంగాణ రాష్ట్రం పైన ఇప్పటికైనా సోయి వచ్చిందని కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కవిత నిజాలు మాట్లాడిందని అన్నారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని కవిత వ్యాఖ్యానించిందని, రాష్ట్ర తలసరి ఆదాయం కవితకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. 10 ఏళ్ల లో తన తండ్రి కేసీఆర్ చేసిన తప్పులు, అప్పులు ను కవిత ఏ నాడు ఎత్తి చూపించలేదు. 10 ఏళ్లు రైతు బంధు పైన కవిత మాట్లాడలేదని, నిజమైన రైతులకు రైతు బంధు అందడం లేదని ప్రతిపక్షంగా ఆ నాడు కాంగ్రెస్ మొత్తుకున్న పట్టించుకోలేదని అన్నారు.

భూమి లేని వారికి సాయం చేయాలని మేం ఆ నాడు అడిగితే పట్టించుకోలేదు. మా ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సాయం అందిస్తోందని అన్నారు.ఆనాడు పంది కొక్కుల్లా పది ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా అప్పుడు కవిత కు సోయి రాలేదా అని అన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రులు అన్ని మీ సామాజిక వర్గం దగ్గర ఉన్నప్పుడు కవితకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా సామాజిక తెలంగాణ కోసం కులగణన చేస్తుంటే మీ నాన్న, అన్న ఎందుకు సర్వేలో పాల్గొన లేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కార్మికులకు కవిత ఎందుకు అండగా నిలబడలేదు.

Also Read: MLC Kavitha: పదేళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేక పోయాం.. కవిత సంచలన కామెంట్స్!

ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసి 30 మంది చనిపోతే ఎందుకు కవిత ఆ నాడు స్పందించలేదని, కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి తన ప్రాధాన్యం తగ్గిపోవడం వల్లనే కవిత ఇప్పుడు ఇలా మాట్లాడుతోందని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ ను కవిత ప్రశ్నిస్తే రాష్ట్రం ఇంకోలా ఉండేదని, ఇప్పటికైనా కవిత కళ్లు తెరిచి మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. కేసీఆర్ హయాంలోని తప్పులను ఇంకా బయటపెట్టి కవిత తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలని అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కులగణన పైన సోయి లేకుండా మాట్లాడుతున్నాడని ఐలయ్య అన్నారు. కాంగ్రెస్ గురించి తన స్థాయిని తగ్గించుకుని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కుల గణన చేయాలని ప్రధాని మోదీ నిర్ణయించడంతో తెలంగాణ బీజేపీ నేతలకు దిమ్మతిరిగిపోయిందని, రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ హీరో చేశారు. అందుకే బీజేపీ నేతలు బాధపడుతున్నారని అన్నారు. కులగణన తో దేశంలోనే రేవంత్ రెడ్డి హీరోలా నిలబడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, బీసీ బిల్లు ను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపడం మా తొలి విజయం అని బీర్ల ఐలయ్య అన్నారు.

Also Read: MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్​ జెండా స్టిక్కర్.. ఎమ్మెల్యే​ వినూత్న నిరసన!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు