MLC Kavitha (imagecredit:twitter)
Politics

MLC Kavitha: పదేళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేక పోయాం.. కవిత సంచలన కామెంట్స్!

MLC Kavitha: కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, అటు గులాబీ పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయి. ఆమె టార్గెట్ ఎవరు? ఎవరిపై ఎక్కుపెట్టి విమర్శలు సందించారు? అనేది హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పటికే రాజకీయంగా దూకుడు పెంచిన కవిత తాజాగా మేడేను పురస్కరించుకొని చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. తలసరి ఆదాయంలో వ్యత్యాసంను సైతం ఎత్తిచూపి ప్రభుత్వాల తప్పిదాలను ఎండగట్టారు. ఎప్పుడు లేని విధంగా భూమిలేని కార్మికులను ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని సూచనలు చేశారు.

ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేతలపైనా పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో దూకుడు పెంచారు. నేతలతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు. బీసీ, మహిళ, కార్మికసంఘాలతోనూ భేటీలు అవుతున్నారు. వారి హక్కుల కోసం పోరాటబాటపట్టారు. కులసంఘాలతోనూ సమావేశమవుతూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వారిని ఎప్పకటిప్పుడు జరుగుతున్న అన్యాయాలపై అప్రమత్తం చేస్తున్నారు.

మరోవైపు బీసీ 42శాతం రిజర్వేషన్ల అంశంపైనా పట్టుపడుతున్నారు. అయితే మేడే ను పురస్కరించుకొని కవిత నివాసంలో కార్మిక సంఘాలతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆమె కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలని, మే డే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఉదాహరించారు.

Also Read: Maoists: నక్సల్స్‌తో శాంతి చర్చలు.. 2004లో ఏం జరిగింది? ఈసారి ఏం చేయాలి?

రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.8 లక్షలు ఉంటే వికారాబాద్‌ జిల్లాలో రూ.లక్ష 58 వేలు మాత్రమే ఉందని, పది‌ కిలోమీటర్లు దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండటం ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలగిపోవడానికి మే డే స్పూర్తి కావాలన్నారు. మరోవైపు’రైతుబంధు కింద ఎకరం ఉంటే రూ.పది వేలు పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చాం. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయాం’ అని అన్నారు. భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలే అనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. అయితే ఎవరిని టార్గెట్ కవిత విమర్శలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారా?

భౌగోళికంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014లో ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ రెండోసారి ఆపార్టీకే ప్రజలు అధికారం కట్టబెట్టారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అయితే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామన్న కవిత వ్యాఖ్యలు కేసీఆర్ పాలనపై పరోక్షంగా విమర్శలు చేశారా?అనే చర్చ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతుంది.

నాటి బీఆర్‌ఎస్‌ పార్టీ విధానాలను తప్పుబట్టారా? పేర్లు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారా? ఇప్పటికే కవిత వేరు కుంపటి పెట్టారనే పుకార్లు వస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు వాటికి బలం చేకూరుస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాటి ప్రభుత్వం చేపట్టిన రైతుబంధుతోపాటు సామాజిక అసమానతలనుఎత్తి చూపారు.

పరిపాలనా లోపాలను కవిత తప్పుబట్టడం చూస్తుంటే కేసీఆర్‌ విధానాలనే వ్యతిరేకించారా? అనే ప్రచారం జరుగుతుంది. కవిత రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవడం, నిత్యం ప్రజల్లో ఉంటూ రాజకీయంగా ఫుల్‌ యాక్టీవ్‌ కావడం, తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ప్రభుత్వంపై విమర్శలా?

కవిత ఇంతకు ఎవరిపై బాణం ఎక్కుపెట్టి ఎవరిపై వదిలింది అనేది ఇప్పడు హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎకరాకు 6వేలు రైతు భరోసా కింద ఇస్తుంది. ఉపాధిహామీ కూలీలకు సైతం ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే భూమిలేని వ్యవసాయకూలీలకు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రూపాయి ఇవ్వడం లేదు. రైతులకు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు ఇవ్వకపోవడంపై విమర్శలు గుప్పించారు.

వారికి ఇవ్వాలని ఒకవైపు సూచిస్తూనే మరోవైపు విమర్శలు గుప్పించారు. తనదైన శైలీలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కార్మికులకు దగ్గరయ్యే ప్రయత్నం సైతం చేసినట్లు స్పష్టమైంది. మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ మేడేను పురస్కరించుకొని కవిత చేసిన విమర్శలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ఎటుదారితీస్తాయో చూడాలి.

Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!