Jabardasth Tanmay: జబర్దస్త్ తన్మయి గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే, రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నమ్మలేని నిజాలను తెలిపింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నా జీవితంలో ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నది లేదు. జబర్దస్త్ వల్ల కొంచం పేరు వచ్చింది. ఇల్లు కట్టుకున్నాను. ఫ్యామిలీని బాగా చూసుకున్నాను. కానీ, వ్యక్తిగత జీవితంలో చాలా డ్యామేజి అయింది. అసలు ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. ఒక ప్రేమ లేదు, కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. బయట కూడా ఎలాంటి సపోర్ట్ లేదు. ఫ్రెండ్స్ కూడా లేరు. ఎక్కడ చూసిన ఫేక్ అంతా.. నమ్మి మోసం పోవడం తప్ప ఇంకేముంది అసలు అంటూ చాలా ఎమోషనల్ అయింది.
Also Read: Affair Video Song: మగవాళ్లకి ఎంట్రీలేని కంట్రీలోకే వస్తానంటే.. ‘ఎఫైర్’ వీడియో సాంగ్ వైరల్
నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను అంటూ తన లైఫ్ లో జరిగిన విషయాలను బయటకు వెల్లడించింది. నేను ఒక పర్సన్ ను ఎనిమిదేళ్లు లవ్ చేశాను. నేను నా ఫ్యామిలీనే కాకుండా, తన ఫ్యామిలీని కూడా చూసుకున్నాను. తను కూడా మా ఇంటి దగ్గరే ఉండేవాడు. కానీ, వాడు నన్ను లవ్ చేయలేదు. నా డబ్బును లవ్ చేశాడు. నన్ను దారుణంగా అంటే చాలా దారుణంగా మోసం చేశాడు. అందరూ నాలో అవే చూశారు.. ఒక్కరూ కూడా నన్ను ప్రేమించలేదు. ఇక, అప్పటి నుంచి ఈ లవ్ అవసరం లేదనిపించిందని చెప్పింది.
Also Read: New Rule for Uber Ola Rapido: క్యాబ్ సేవల్లో కొత్త రూల్స్.. 25% డిస్కౌంట్లు.. డ్రైవరే డబ్బు ఇవ్వాలి!
కిరాక్ ఆర్పీ మోసం చేశాడు?
జబర్దస్త్ తన్మయి మాట్లాడుతూ ” నా జీవితంలో నాకు ఎవరూ సాయం చేయలేదు. నేను కోరిన వాళ్ళలో కూడా ఒక్కరూ కూడా చేయలేదు. జబర్దస్త్ వాళ్ళు కూడా మోసం చేశారని చెప్పింది. అతనెవరో కాదు కిరాక్ ఆర్పీ అని ఓపెన్ గా పేరు బయటకు చెప్పేసింది. అతను నేను లైఫ్ లో మర్చిపోలేను. నేను అదిరింది కి వచ్చింది కూడా అతని వల్లే అని చెప్పుకొచ్చింది. అతనికి ఒకానొక టైమ్ లో నేను చాలా సపోర్ట్ చేశాను. అతన్ని ఒక అన్న లాగా చూశాను. కానీ, అతని మైండ్ సెట్ వేరు. తను అంతా చాలా వేరుగా ఉంటాడు. తనని ఎప్పుడు తప్పు అని అనను ..ఎప్పటికీ అనను కూడా అని అన్నది. పర్సనల్ విషయాల్లో తన వల్ల చాలా బాధ పడ్డాను. తనకి నేను ఎంతలా సపోర్ట్ చేశానంటే.. అంతలా చేశాను. ఆ విషయం తనకి కూడా తెలుసు. కానీ, చివరికి తన వలనే నేను బయటకు వచ్చాను. డబ్బులు పరంగా కూడా హెల్ప్ చేశాను. నాకు కష్టం వస్తే ఈ రోజున నేను ఎలా ఉన్నా అని కూడా అడగలేదని ” ఎమోషనల్ అవుతూ చెప్పింది.