Pakistani Senator: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా భారత బలగాలు.. పాక్ పై దాడి చేయవచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈసారి పాక్ కు భారత్ గట్టిగా బుద్ది చెప్పడం ఖాయమని ప్రతీ ఇండియన్ పేర్కొంటున్నారు. మరోవైపు యుద్ధ భయంలో ఉన్న పాక్ ప్రభుత్వ పెద్దలు.. దానిని బయటకు కనిపించకుండా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ మహిళా సెనేటర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పదంగా మారాయి.
బాబ్రీ మసీదుకు పునాది
పాకిస్తాన్ సెనెటర్ పాల్వాషా మహమ్మద్ జైన్ ఖాన్ (Palwasha Mohammad Zai Khan).. భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. ఏకంగా పాక్ చట్టసభలోనే తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ బలగాలు పునాది రాయి వేస్తాయని పాల్వాషా ఖాన్ అన్నారు. అక్కడి నుంచి పాక్ ఆర్మీ చీఫ్ తొలి అజాన్ ఇస్తారంటూ తన వక్రబుద్ధిని బయటపెట్టారు. ఇక భారత్-పాక్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ తామేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదని.. భారత్ కు తగిన బుద్ధి చెబుతామని చెప్పుకొచ్చారు.
Pakistani Senator Palwasha Mohammad Zai Khan on Tuesday. 'The First brick at the new Babri Mosque in Ayodhya will be put by Pak Army soldiers, & first azan by Pakistan Army chief Munir' #IndiaPakistanWar #Sialkot pic.twitter.com/8c5gcy6c7b
— Global__Perspectives (@Global__persp1) April 30, 2025
సిక్కులు దాడి చేయరు
భారత సైన్యంలో గణనీయ సంఖ్యలో సిక్కులు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పాల్వాషా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం సంభవిస్తే భారత ఆర్మీలోని సిక్కులు.. పాక్ పై దాడి చేయరని పేర్కొన్నారు. వారి మత గురువు గురు నానక్ (Guru Nanak) జన్మించిన ప్రదేశం కాబట్టి వారు మౌనంగా ఉండిపోతారన్న విధంగా వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 29న జరిగిన పాక్ పార్లమెంటు సమావేశాల్లో ఎగువ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ప్రసంగం ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎవరీ పాల్వాషా ఖాన్
పాల్వాషా ఖాన్ విషయానికి వస్తే ఆమె పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చెందిన సెనేటర్. డిప్యూటీ ఇన్ఫర్మేషన్ సెక్రటరీగానూ ఉన్నారు. 2021 నుంచి పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2008 – 2013 మధ్య పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగానూ పనిచేశారు. ప్రముఖ పాక్ పొలిటిషియన్, వ్యాపారవేత్త అయిన ఫోజియా బెహ్రంకు పాల్వాషా మేనకోడలు అవుతారు.
యుద్ధానికి రంగం సిద్ధం?
జమ్ముకాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మృత్యువాత పడ్డారు. ఆర్మీ దుస్తులు, కాశ్మీరి వేషదారణలో వచ్చిన ఐదారుగురు ముష్కరులు.. పహల్గాంలోని పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారి మతాన్ని అడిగి తెలుసుకొని మరి ప్రాణాలు తీశారు. దాడి సమయంలో వారి క్యాప్స్ కు కెమెరాలు సైతం ఉన్నట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం.. పాక్ పై ద్వైపాక్షిక యుద్ధానికి తెరతీసింది. అటు ప్రత్యక్ష యుద్ధానికి సైతం భారత సైన్యం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.