Minister Sridhar Babu: కాళేశ్వర పుణ్యక్షేత్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని దేవాదాయ శాఖ అధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర గ్రామంలో మే 15 నుండి 27 వరకు నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను, రూ.25 కోట్లతో కాళేశ్వరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి కాళేశ్వరంలో వివిఐపి ఘాట్, గోదావరి ఘాట్, 100 గదుల సత్రం వైద్యశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
నాణ్యతల్లో ఎలాంటి తేడా లేకుండా పనులు చేయాలని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి పుష్కరాలకు అందుబాటులోకి తేవాలని గుత్తేదారులను, అధికారులకు మంత్రి ఆదేశించారు.
సరస్వతి పుష్కరాలు పూర్తి కాగానే గోదావరి నది ఒడ్డున ఉన్న రైతుల భూములను అక్వేషన్ చేసి 2027 లో వచ్చే గోదావరి పుష్కరాలకు ఘాట్ ను పెంచాలి కాళేశ్వరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలనీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సూచించారు. పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరిలో వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని సూచించారు.
సమయం చాలా తక్కువగా ఉందని, ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పనులు జరగలేదని అధికారులు గుర్తించి నిర్దిష్ట కార్యాచరణతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పనులు వేగవంతం చేసేందుకు కూలీలను పెంచాలని సూచించారు.