Manchu Family on Single Trailer
ఎంటర్‌టైన్మెంట్

Manchu Family: శివయ్యా.. ఎంత పని చేశావయ్యా! ‘సింగిల్’ ట్రైలర్‌తో మంచు ఫ్యామిలీ హర్ట్!

Manchu Family: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో చిన్న పాటి యుద్ధమే నడుస్తుంది. ఫ్యామిలీ గొడవలు అందరి ఇళ్లలో ఉండేవే.. కానీ, వారి గొడవను పబ్లిక్‌లోకి తెచ్చేశారు. ముఖ్యంగా మంచు మనోజ్ (Manchu Manoj) ఏ చిన్న విషయం జరిగినా మీడియా వారిని పిలిచి, హడావుడి చేస్తునే ఉన్నాడు. మీడియా వాళ్లు ఇన్వాల్వ్ అయితే, మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) అస్సలు సహించలేకపోతున్నారు. మరో వైపు మంచు విష్ణు (Manchu Vishnu) ఈ గొడవలో మధ్య మధ్యలో వేలు పెడుతూ.. చేయాల్సినవన్నీ చేస్తూ.. కామ్‌గా మరోవైపు తన సినిమా ‘కన్నప్ప’ (Kannappa) ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు.

Also Read- Singer Pravasthi: జన్మలో రియాలిటీ షోలు చెయ్యను.. త్వరలో గుడ్ న్యూస్ చెబుతా..

అసలు ఈ గొడవకి కారణం మా నాన్న కాదు, మా అమ్మ కాదు.. మా అన్న, అతని చుట్టూ ఉన్న అనుచరులే అనేలా మంచు మనోజ్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఈ గొడవను తీర్చడానికి పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా చూసేవారు.. ఇప్పుడప్పుడే ఇది తెగే విషయం కాదులే అని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటి పెద్ద మోహన్ బాబు కంట్రోల్‌లో కూడా ఈ విషయం లేకపోవడం, రాకపోవడం విడ్డూరం. మరోవైపు మంచు లక్ష్మీ ఈ గొడవలు చూడలేక, తట్టుకోలేక ముంబైకి మకాం మార్చేసింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మంచు ఫ్యామిలీ అంటే చాలు గొడవలే అనేలా పరిస్థితులు మారిపోయాయంటే.. ఏ రేంజ్‌లో వారి ఇంటి భాగోతం ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే ఇవన్నీ పక్కన పెడితే..

ఇక టైటిల్ విషయానికి వద్దాం.. ‘సింగిల్’ ట్రైలర్‌ (Single Trailer)తో మంచు ఫ్యామిలీ హర్ట్ అవడం ఏమిటని అనుకుంటున్నారు కదా..! అయితే ఆ ట్రైలర్ ఒక్కసారి అందరూ చూడాల్సిందే. ఈ ట్రైలర్ చూస్తే, మంచు ఫ్యామిలీ ఎందుకు హర్టయిందో అర్థమవుతుంది. ఈ ట్రైలర్‌లో హీరో శ్రీ విష్ణు ‘శివయ్యా’ అని పిలవడంతో పాటు, ‘మంచు కురిసిపోవడం’ అనే డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పుడీ డైలాగ్స్‌తో మంచు మనోజ్ ఏమో గానీ, మిగతా వారంతా హర్ట్ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. అసలే మెగా ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో పడదని అంతా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడదే ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్ (Allu Aravind) నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ సినిమాలో, ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసేలా డైలాగ్స్ పెట్టారని, సోషల్ మీడియాలో కూడా ఒకటే వార్తలు.

Also Read- Singer Sri Krishna: సింగర్ శ్రీకృష్ణ అలాంటివాడా? బండారం బయటపెట్టిన లేడీ సింగర్!

ఈ విషయంలో మంచు విష్ణు కూడా చాలా హర్టయ్యాడనేలా టాక్ నడుస్తుంది. మరి రిలీజ్ నాటికి ఈ సినిమాలో ఆ డైలాగ్స్ ఉంటాయో, లేదో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే ఈ డైలాగ్స్ సినిమాకు కావాల్సిన కాంట్రవర్సీని, అదే టైమ్‌లో పబ్లిసిటీని వచ్చేలా చేస్తున్నాయి. ఈ డైలాగ్స్‌పై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. స్పోర్టివ్‌గా తీసుకుంటారా? అసలు జరుగుతుందనేది చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు