Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదంలో రోజుకొక విషయం వెలుగులోకి వస్తుంది. అప్పటి వరకు అంతా మంచిగా ఉందనుకున్న సమయంలో ఎవరూ ఉహించని విధంగా ప్రవస్తి ఆరాధ్య మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన కామెంట్స్ చేసింది.
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో వివక్షత ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా ప్రవస్తి ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం స్కీమ్ లో కొత్త మెలిక? ఆ తప్పు చేస్తే డబ్బు రానట్లే!
మీరు ఎలిమినేట్ అయ్యాకే మీడియా ముందుకు ఎందుకు వచ్చారని చాలా మంది అడుగుతున్నారు.. మరి, దీనికి మీరేం సమాధానం చెబుతారు. వాళ్ళకి కనిపించేది ఒక గంట షో మాత్రమే.. మేము అక్కడ 15 గంటలు షూటింగ్ లో ఉంటాము. ఆ సమయంలో లోపల ఏం జరుగుతుందో మాకే తెలుస్తుంది. చాలా మంది ఇలాగే అడుగుతున్నారు నన్ను కూడా.. వాళ్ళకి చెబుతున్నా.. వినండి. నేను ఇప్పటి నుంచి, ఇక మీదట జన్మలో రియాలిటీ షోలు చెయ్యను అని చెప్పింది. నా లాగా ఇంకో అమ్మాయి కానీ, అబ్బాయికి కానీ ఇలా కాకూడదనే ఫైట్ చేస్తున్నాను. నేను కూడా ఒకటి అడుగుతున్నాను.. నేను వీడియో చేశాక సునీత మేడమ్ వైపు తప్పు లేకపోతే బయటకు ఇప్పుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు కదా .. అంటే ఆమె వైపు తప్పు ఉందనే కదా అర్ధం ” అంటూ షాకింగ్ నిజాలు బయటకు వెల్లడించింది. అలాగే, త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. తను పాడబోయే మొదటి సినిమా పాట గురించి మనందరితో పంచుకోనుంది. మరి, ఏం జరుగుతుందో చూడాలి.