Simhachalam Tragedy (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Simhachalam Tragedy: సింహాచలం విషాదం.. సాఫ్ట్ వేర్ దంపతులు సహా ఫ్యామిలీలో నలుగురి మృతి

Simhachalam Tragedy: సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక దర్శనం టికెట్ కౌంటర్ వద్ద ఉన్న గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న భక్తులపై అది పడిపోవడంతో పలువురు మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటం మరింత బాధను కలిగిస్తోంది. అందులోనూ ఇద్దరు సాఫ్ట్ వేర్ దంపతులు కావడం కంటతడి పెట్టిస్తోంది.

ఒకే ఫ్యామిలీలో నలుగురు
విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రపాలెంకు చెందిన పిళ్ళా ఉమా మహేశ్వరావు (30), పిళ్లా శైలజ (29).. సింహాచలం విషాదంలో ప్రాణాలు కోల్పోయారు.  శైలజ తల్లి పైలా వెంకట రత్నం.. మేనత్త గుజ్జారి మహాలక్ష్మీ కూడా ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోం చేస్తూ
ఘటనలో చనిపోయిన పిళ్ళా ఉమా మహేశ్వరావు, పిల్లా శైలజ భార్య భర్తలు. హైదరాబాద్ కు చెందిన రెండు వేర్వేరు కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తమ స్వస్థలాల్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. వీరికి మూడేళ్ల క్రితమే వివాహం జరిగినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉ అయితే సింహచలం అప్పన్నను దర్శించుకోవాలని భావించిన వారిద్దరు.. బంధువులైన వెంకటరత్న, మహాలక్ష్మీలను తీసుకొని తెల్లవారుజూమునే ఆలయం వద్దకు చేరుకున్నారు. రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వేచి ఉండగా గోడ కూలి మరణించారు.

Also Read: YS Sharmila: షర్మిల ఇంటి వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

సీఎం స్పందన
సింహాచలం విషాదంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనలో గాయపడిన వారికి ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని సీఎం సూచించారు. సింహచలంలో కురిసిన ఈదురుగాలుల వర్షం ధాటికి గోడ కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Also ReadGold Rate Today : అక్షయ తృతీయ ఎఫెక్ట్.. తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు మిస్ అయ్యారో?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?