Kishkindhapuri: ఆకారం చూస్తే యాక్షన్ హల్క్ ఉన్నట్లుగా ఉంటాడు. యాక్టింగ్ పరంగానూ తనేంటో నిరూపించుకున్నాడు. కానీ, కొన్ని సినిమాలుగా బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)కు అస్సలు కలిసి రావడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ అని ప్రయత్నాలు చేస్తున్నా, హిట్ మాత్రం బాబుకి రావడం లేదు. కానీ ప్రయత్న లోపం లేకుండా, తన కష్టంలో ఏ లోటు జరగకుండా తను చేయాల్సింది చేస్తూనే ఉన్నాడు. కాకపోతే, ఈసారి ఇంకాస్త కాన్ఫిడెన్స్‌తో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ విషయం తాజాగా ఆయన నటించిన ‘కిష్కంధపురి’ చిత్ర గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.
Also Read- Singer Sri Krishna: సింగర్ శ్రీకృష్ణ అలాంటివాడా? బండారం బయటపెట్టిన లేడీ సింగర్!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీమతి అర్చన సమర్పణలో సాహు గారపాటి (Sahu Garapati) నిర్మిస్తున్న చిత్రం ‘కిష్కంధపురి’. కౌశిక్ పెగల్లపాటి (Koushik Pegallapati) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుంది. అద్భుతమైన హర్రర్-మిస్టరీ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చేలా ఒక యూనిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమాగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్ ఆ విషయాన్ని మరింత స్పష్టం చేస్తుంది. గ్లింప్స్‌ని గమనిస్తే.. (Kishkindhapuri First Glimpse)
హీరోహీరోయిన్లు ఒక హాంటెడ్ హౌస్‌లోకి వెళ్ళడంతో ఈ కథ మొదలవుతుంది. ‘కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు’ అనేలా చెబుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే ‘అహం మృత్యువు’ అనే డైలాగ్‌తో గ్లింప్స్ ముగిసింది. ఆయన ఆ డైలాగ్ చెప్పే తీరు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా ఒక విజువల్ వండర్‌ని తలపిస్తున్నాయి. వెన్నులో వణుకు పుట్టించేలా, అతీంద్రియ అంశాల డెప్త్‌ని విఎఫ్ఎక్స్ టాప్ రేంజ్‌కి తీసుకెళ్లాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఓ అద్భుతం సృష్టించబోతున్నాడనే విషయాన్ని ఈ ఫస్ట్ అటెంప్ట్‌తోనే కలిగించారు. (Kishkindhapuri Glimpse Talk)
ఓవరాల్‌గా చూస్తే, గ్లింప్స్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకుంటున్న హిట్ సాలిడ్‌గా పడబోతుందనేది ఈ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేస్తుంది. మరోవైపు అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. మరోసారి వాళ్ల కాంబోలో రాబోతున్న ఈ మూవీ కూడా కచ్చితంగా సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలుస్తుందని వారి అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ గ్లింప్స్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాన్ఫెడెన్స్ కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాలతో హిట్ కొడితే.. ఆ హీరో పేరు ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు