Tollywood Star Hero: నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఒకానొక సమయంలో వరుస హిట్స్ తో దూసుకెళ్ళాడు. నాని ఏది చేసిన చాలా నేచురల్ గా ఉంటుంది. అందు వలనే అతనికి నేచురల్ స్టార్ అనే పేరు వచ్చింది. ఎప్పుడూ కూల్ మూవీస్ తీసే నాని ఈ సారి పెద్ద ప్రయోగం చేసి వైలెన్స్ ఎక్కువగా ఉండే హిట్ 3 లో హీరోగా చేశాడు. ఈ సినిమాలో ఇంత వరకు చూడని నానిని చూడబోతున్నామని అర్ధమవుతోంది.
శైలేష్ కొలను డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ మే 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మూవీలో ఎన్నడూ చూడని వైలెన్స్ చూస్తాము. ఇది A సర్టిఫికెట్ మూవీ అని, పిల్లలు ఈ చిత్రాన్ని చూడకూడదని చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ముందుగానే చెప్పారు. నాని ఉన్న ఫామ్ కి పెద్ద హిట్ అందుకునేలా ఉన్నాడు. అయితే, ఇదిలా ఉండగా నానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
నెక్స్ట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాని బిగ్ స్టార్ అవుతాడని, ఆ విషయంలో సందేహమే అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఎందుకంటే, తన ఎంచుకున్న కథలు అలాంటివి. ఇప్పటికే వరుస హిట్స్ తో ఓవర్సీస్ లో ఏ హీరోకి లేని మార్కెట్ ను పెంచుకుని ట్రెండ్ సెట్ చేశాడు. ఇక ఇప్పుడు హిట్ 3 తో పెద్ద హిట్ కొట్టి, ఆ తర్వాత ది ప్యారడైజ్ తో కుంభస్తలాన్ని బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇది మాత్రమే కాకుండా దసరా 2 , ఇంకా కమిట్ అయిన కొత్త సినిమాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఐదు సినిమాలతో హిట్స్ అందుకుని బిగ్గెస్ట్ స్టార్ గా నిలవబోతున్నాడని సినీ వర్గాల వారు చెబుతున్నారు.