తెలంగాణ: Faheem on KCR: అసెంబ్లీకి వచ్చే కేసీఆర్ పిల్లలకు డైపర్లు, హార్లిక్స్ పంపిణీ చేస్తామని పుడ్ కార్పొరేషన్ చైర్మన్ పహీం ప్రకటించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…రేవంత్ ను చూస్తే కేసీఆర్ పిల్లలకు తడిచిపోతుందని, అందుకే డైపర్లు అందజేస్తామన్నారు.
పదేళ్లలో బీఆర్ ఎస్ చేయని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కాంగ్రెస్ పై బురద జల్లే ప్రక్రియ జరుగుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీపై అక్కసు వెళ్లగక్కారన్నారు.అధికారం లేకుండా 15 నెలలు అయ్యేసరికి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: Bhoodan land Issue: హైదరాబాద్ లో బడా భూముల స్కామ్.. ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు!
బీఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలు అధికారం ఇచ్చినా, ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల 12 శాతం రిజర్వేషన్ ఊసేది? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నారు.