BJP Sunil Bansal (imagecredit:twitter)
Politics

BJP Sunil Bansal: రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ సీరియస్..!

తెలంగాణ: BJP Sunil Bansal: బీజేపీలో క్రియాశీల సభ్యత్వాల కిరికిరి మొదలైంది. సాధారణ సభ్యత్వాలు 45 లక్షలకు రీచయ్యామని ఆనందిస్తున్న కమలం పార్టీ నేతలకు బన్సల్ రూపంలో క్రియాశీల సభ్యత్వాల షాక్ తగిలింది. తెలంగాణలో 13 వేల క్రియాశీల ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయంటూ స్వయంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ సునిల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగులో ప్రస్తావించడం సంచలనంగా మారింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని నిర్వహించారు.

కాగా క్రియాశీల సభ్యత్వ అంశంపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. 13 వేల ఫేక్ క్రియాశీల సభ్యత్వాలిస్తే తెలుసుకోనేంత తెలివి కూడా లేకుండా పార్టీ నడుపుతున్నారనుకున్నారా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఇన్నిరోజులు సంస్థాగతంపై ఆహా ఓహో అంటూ గొప్పలు చెప్పుకున్న నేతలకు బన్సల్ దెబ్బతో పెద్ద షాక్ తగిలినట్లయింది.

టార్గెట్స్ రీచ్: 

తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. కాగా పార్టీ 45 లక్షల టార్గెట్ ను రీచ్ అయింది. ఆపై క్రియాశీల సభ్యత్వాల నమోదుపై దృష్టి కేంద్రీకరించింది. సదరు నాయకుడు పార్టీకి ఏం చేశారు? అనే అంశాలతో పాటు ప్రజాక్షేత్రంలో చేసిన పోరాటాల వివరాలు, ఇతర అంశాలను సైతం ప్రస్తావించింది. వాస్తవానికి క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాల్సి ఉండగా.. ఇలా ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వడంపై రాష్ట్ర నాయకత్వాన్ని సునిల్ బన్సల్ కడిగిపారేసినట్లు సమాచారం.

ఒక పార్టీ బతకాలంటే సభ్యత్వాలు అత్యంత కీలకం. అలాంటి అంశాన్ని బీజేపీ నేతలు చాలా లైట్ తీసుకోవడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. ఎందుకంటే దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణను జాతీయ నాయకత్వం ఎంచుకుంది. అందుకే క్రమంగా గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతమవ్వాలని సభ్యత్వాలను టాస్క్ గా ఫిక్స్ చేసింది. కానీ రాష్ట్ర నాయకత్వం ఫేక్ సభ్యత్వాలు ఇవ్వడంపై హైకమాండ్ సైతం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అయితే క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించిన వివరాలను మ్యాన్యువల్ పద్ధతిన తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మాట్ లో అప్ డేట్ చేయాల్సి ఉందని పార్టీ చెబుతుండటం గమనార్హం.

Also Read: Bhoodan land Issue: హైదరాబాద్ లో బడా భూముల స్కామ్.. ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు!

బీజేపీలో పదవులు కావాలంటే క్రియాశీల సభ్యత్వాలను ప్రామాణికంగా పెట్టారు. ఈ నిబంధన కారణంగానే దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. క్రియాశీల సభ్యత్వమున్న వారికే పార్టీలో కీలక పదవులు దక్కుతాయని, లేదంటే కష్టమని పార్టీ కరాఖండిగా చెప్పింది. జిల్లా అధ్యక్​షుల నుంచి రాష్​ట్ర అధ్యక్షుడి వరకు కనీసం రెండు క్రియాశీల సభ్యత్వాలుంటేనే అర్హుడనే నిబంధన విధించారు. అయితే గతంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న సదరు నేతకు ఈ నిబంధనను సాకుగా చూపించి ఆయనకు క్రియాశీల సభ్యత్వం లేదని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి.

గౌతమ్ రావుకు సభ్యత్వం ఉందా! .. : 

అలాంటిది తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన గౌతమ్ రావుకు క్రియాశీల సభ్యత్వ లేదని తెలుస్తోంది. క్రియాశీల సభ్యత్వాల అంశంలో రాష్ట్ర నాయకత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపోతే మండలం నుంచి మొదలుకుని రాష్ట్ర అధ్యక్షుడి వరకు వయోపరిమితి నిబంధన కూడా విధించిన విషయం తెలిసిందే.

క్రియాశీల సభ్యత్వాల అంశంపై సునిల్ బన్సల్ కొత్తగా ఎంపికైన జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించినట్లు తెలిసింది. కేవలం వర్క్ షాప్ లు, ఇండోర్ మీటింగులు పెట్టుకుంటే సరిపోదని బన్సల్ వారికి స్పష్టంచేసినట్లు సమాచారం. అలాగే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది. ఏసీ రూంలలో కూర్చుంటే పనులు కావని, ఫీల్డ్ లోకి వెళ్లాలని నేతలకు బన్సల్ గట్టిగానే చెప్పినట్లు వినికిడి.

జాతీయ నాయకత్వం ఇచ్చిన గావ్ చలో.. బస్తీ చలో, అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణపైనా ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేసిన పోరాటాల వివరాలపైనా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సైతం ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది.

Also Read: Harish Rao – Kavitha: గులాబీ కమిటీలో చోటు దక్కేనా? పదవులపై హరీష్, కవిత మల్లగుల్లాలు!

మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై వేగం పెంచాలని బన్సల్ నాయకులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. మే 15 వరకు మండల అధ్యక్షుల ఎన్నికలను పూర్తి చేయాలని బన్సల్ ఆదేశించినట్లు సమాచారం. ఆపై మండల అధ్యక్షులకు వర్క్ షాప్ లు నిర్వహించాలని దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. 38 జిల్లాలను ఐదు జోన్లుగా విభజించి.. ఐదు జోన్లలో, జోన్లవారీగా వర్క్ షాప్ లు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

ఈ కార్యశాలలకు జాతీయ నేతలు సైతం హాజరవుతారని తెలిసింది. వచ్చేనెల 17 తర్వాత మండల అధ్యక్షులకు ఈ వర్క్ షాప్ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ప్రతి మండల కమిటీలో కచ్చితంగా ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించాలని, అందులో ఒక ఎస్టీ, ఎస్సీ కానీ తప్పక ఉండాలని బన్సల్ స్పష్టంచేసినట్లు సమాచారం. మరి రాష్​ట్ర నాయకత్వం క్రియాశీల సభ్యత్వాలు, సంస్థాగత బలోపేతంపై ఏం చేయనుందనేది చూడాలి.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?