AP Govt Schools: ఏపీలో ఓ వ్యక్తి చేస్తున్న ప్రమోషన్ అలాంటిది ఇలాంటిది కాదు. అది కూడా ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అతను చేస్తున్న ప్రమోషన్స్ కి అందరికీ దిమ్మ తిరుగుతుందట. ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇన్ని ప్రయోజనాలా అనే తీరులో అతను చేస్తున్న ప్రమోషన్స్ కు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ట్రెండీగా మారిన ఈయన మైక్ పట్టారంటే నవ్వులు విరౠయాల్సిందే. ఇంతకు ఆయనెవరో అనుకుంటున్నారా.. ఆయనే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన భోగేశ్వరరావు.
కొవ్వూరుకు చెందిన భోగేశ్వరరావు సోషల్ మీడియాలో ట్రెండీగా మారారు. ఇంతకు ఈయన వృత్తి ఏమిటో తెలుసా.. ప్రచారం సాగించడమే. ఏ షాపు గురించైనా, ఏ అనౌన్స్ మెంట్ పరిసర ప్రాంత ప్రజలకు చేరవేయాలన్నా భోగేశ్వరరావు ఉండాల్సిందే. ఈయన మాట్లాడే శైలి, ప్రచారం చేసే పద్ధతి అదో వెరైటీ అనుకోండి. అందుకే ఈయనకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్. ప్రతి రోజూ తన ఇన్ స్ట్రాగ్రామ్ పేజీ ద్వారా నవ్వించే మాటలతో నెటిజన్స్ మోముపై చిరునవ్వులు చిందించడం ఈయన వంతు.
ఈయన వీడియోలకు ఏ ఒక్క బ్యాడ్ కామెంట్స్ రాని పరిస్థితి. అయితే భోగేశ్వరరావు బిగ్ అనౌన్సర్ గా గుర్తింపు పొందారు. చిన్నపాటి బైక్ కు మైక్ సెట్ ఏర్పాటు చేసుకొని అనౌన్స్ చేయమన్న అంశాన్ని వాడవాడనా ప్రచారం చేయడం ఈయన నైజం. ఈయన ప్రచారం చేశారంటే, అదొక హైలెట్ అంటారు స్థానికులు. చివరికి పోలీసులు కూడా భోగేశ్వరరావు చేత తమ అనౌన్స్ మెంట్స్ సాగించడం విశేషం.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం భోగేశ్వరరావు చేస్తున్న ఒక ప్రచారం నభూతో న భవిష్యత్ లా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మైక్ ప్రచారం ఏదో హోటల్, ఏదో బిజినెస్ గురించి అనుకోవద్దు సుమా.. ఇదొక ప్రభుత్వ పాఠశాల గురించి ప్రచారం. ప్రస్తుతం ఏపీలో బడులకు సెలవులు. ఈ సంధర్భంగా ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రచారం అక్కడక్కడా సాగిస్తున్నాయి. అదే రీతిలో ప్రభుత్వ పాఠశాలల టీచర్స్ కూడా తాము కూడా తగ్గేదెలే అనే తీరులో తమ ప్రచారం సాగిస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఏపీ బడులలో సరికొత్త విధానాలు ప్రవేశపెట్టి టెన్త్ ఫలితాలలో సైతం ప్రభుత్వ బడులు తమ సత్తా చాటాయి. కాగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లోని శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాల గురించి భోగేశ్వరరావు చేసిన ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అనే రేంజ్ లో ఈ అనౌన్స్ మెంట్ ఉంది. ఈ ప్రచారంతో ఏపీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వైపు తల్లిదండ్రులు దృష్టి సారించడం ఖాయమని చెప్పవచ్చు.
Also Read: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం స్కీమ్ లో కొత్త మెలిక? ఆ తప్పు చేస్తే డబ్బు రానట్లే!
ఇంతకు ఆయన అనౌన్స్ మెంట్ ఏమిటంటే.. కొవ్వూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి.. సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గరలో గవర్నమెంట్ పాఠశాల ఉంది. ఇక్కడ ఒకటి నుండి 5 వరకు చదువంతా ఉచితమే. ఇక్కడ మీ పిల్లలు చదివితే అమెరికా, ఆస్ట్రేలియా కు పంపవచ్చు. అంతేకాదు ప్రతి విద్యార్థికి 3 జతలు దుస్తులు ఫ్రీ, అలాగే బెల్ట్ ఫ్రీ, పుస్తకాలు, నోట్ బుక్స్ ఫ్రీ, కాళ్ళకు ముల్లు గుచ్చుకోకుండా ఉండడం కోసం షూస్ ఇస్తారు.. ఆకలి వేయకుండా ఉండడం కోసం భోజనం, నీరసం రాకుండా ఉండడం కోసం కోడి గ్రుడ్డు, చిక్కి ఇస్తారు. దూర ప్రాంతాల వారికి సైకిళ్ళు ఫ్రీ గా ఇస్తారు. మీ పిల్లల ఆరోగ్యం కోసం ఫ్రీగా ఉచిత కంటి అద్దాలు, మెడిసిన్ కూడా ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి క్లాస్ కు ఒక టీచర్ ఉంటారు. పద్దతిగా మీ పిల్లలకు చదువు నేర్పిస్తారు అంటూ ప్రచారం సాగించారు.
ఈయన ప్రచారంతో ప్రభుత్వ బడులకు పిల్లలను పంపిస్తే ఇన్ని ప్రయోజనాలా అనే తీరులో తల్లిదండ్రులు ఆలోచించే పరిస్థితి వచ్చింది. అసలే భోగేశ్వరరావు మాట తీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అలాంటి వ్యక్తి ప్రభుత్వ బడుల గురించి చేసిన అనౌన్స్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. మరెందుకు ఆలస్యం.. ఆయన మాట వినండి.. మీ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపండి.