Yadagiri Gutta Hundi income: తెలంగాణలోని సుప్రసిద్ధ ఆలయాల్లో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. నిత్యం భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆలయ హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 34 రోజులకు గాను మొత్తంగా రూ.2,41,35,238 నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 143 గ్రాముల బంగారం, 4 కేజీల 200 గ్రాముల వెండిని భక్తులు కానుక రూపంలో సమర్పించినట్లు పేర్కొన్నారు.
Also Read: TG SSC 10Th class Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు
విదేశీ కరెన్సీ సైతం పెద్ద ఎత్తున విరాళాల రూపంలో వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి తెలియజేశారు. అమెరికన్ భక్తుల నుంచి 702 డాలర్లు, ఆస్టేలియా నుంచి 210 డాలర్లు, ఇంగ్లాండ్ నుంచి 70 పౌండ్స్, నేపాల్ నుంచి 140 రుపిస్ కానుకల రూపంలో సమర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే సౌదీ అరేబియన్ నుంచి 435 రియల్, సింగపూర్ భక్తుల నుంచి 9 డాలర్స్, ఖతర్ నుంచి 2.25 రియల్, ఒమన్ నుంచి 1/2 రియల్ 100 బైస వచ్చినట్లు తెలిపారు. అలాగే యూరో, శ్రీలంక, థాయిలాండ్, టాంజానియా, నార్వే దేశాలకు చెందిన కరెన్సీ సైతం కానుకల రూపంలో వచ్చినట్లు వివరించారు.