NTRNeel: ఒక గుడ్ న్యూస్ వస్తే.. వెంటనే ఒక బ్యాడ్ న్యూస్ అన్నట్లుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) అభిమానుల పరిస్థితి మారింది. ‘దేవర’ (Devara) సినిమా తర్వాత ‘దేవర 2’ వెంటనే వస్తే ఆ క్రేజ్ కంటిన్యూ అయ్యేది. ఇప్పుడేమో ఆ సినిమా కథని రకరకాలుగా కొరటాల మారుస్తున్నారని, కొంతమంది స్టార్స్‌ని యాడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేలా టాక్ నడుస్తుంది. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్, హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకునే ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేసే సినిమా షూటింగ్ ప్రారంభమవడంతో పిచ్చ హ్యాపీగా ఫీలయ్యారు.
Also Read- Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న బాలయ్య, అజిత్‌ల స్పందన ఇదే!
‘ఎన్టీఆర్‌నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లుగా చిత్ర నిర్మాతలే ప్రకటించేశారు. అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఈ షూట్‌లో పాల్గొనక ముందే, చిత్ర రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. రాబోయే సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని 09, జనవరి 2026న ఈ డైనమైట్ బ్లాస్ట్ అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి బరిలో తారక్ సినిమా అనగానే ఫ్యాన్స్ కూడా యమా హ్యాపీగా తమ సంతోషాన్ని తెలియజేశారు.
మరి ఏమైందో ఏమో కానీ, ‘డ్రాగన్’ రిలీజ్ వాయిదా పడింది. అసలు సినిమా షూటింగ్ స్టార్టయిందే మొన్న. అప్పుడే రిలీజ్ వాయిదా ఏంటి? అని అనుకుంటున్నారు కదా. ఇక్కడే ఉంది విషయం. ఎప్పుడైతే ఎన్టీఆర్ షూట్‌లో జాయిన్ అయ్యాడో.. ఈ సినిమా స్పాన్ మరింతగా పెరిగిందని, అసలు ఏ విషయంలో వెనకడుగు వేయకుండా అత్యద్భుతంగా చిత్రీకరించాలని డిసైడ్ అయ్యాడట ప్రశాంత్ నీల్. అలా సినిమా రావాలంటే, వారు చెప్పిన డేట్‌కి సినిమాను రెడీ చేయడం కష్టమని మేకర్స్ భావించారట. ఎంత ప్రయత్నించినా ఆ తేదీకి వస్తామనే నమ్మకం టీమ్ చెప్పలేకపోవడంతో, ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయక తప్పలేదని టీమ్ అంటోంది.
Also Read- Prakash Raj: పవన్ కళ్యాణ్‌కు అసలేం తెలియదు.. పుసుక్కున అలా అనేశాడేంటి? వీడియో వైరల్!
అన్నీ ఆలోచించి, ఈ ‘డ్రాగన్’ను 25 జూన్, 2026న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఎప్పుడైతే వారు ఫిక్సయ్యారో వెంటనే డేట్ లాక్ చేసి, అఫీషియల్‌గా ప్రకటించేశారు. అవును ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల చిత్రం సంక్రాంతికి రావడం లేదు. నిజంగా ఇది ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడో గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటంటే.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ స్పెషల్ గ్లింప్స్‌ని ఫ్యాన్స్ కోసం విడుదల చేయడం జరుగుతుందని మైత్రీ మూవీ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో.. ఇది చాలు మాకు అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు