Deputy CM on Terror Attack (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

Deputy CM on Terror Attack: రోహింగ్యాలపై.. పవన్ సంచలన కామెంట్స్

Deputy CM on Terror Attack: భారతదేశంలో ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్నారని, కొత్త శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదని, ముందు ఉన్న వారి అవసరాలు తీర్చాలి కాబట్టి ఎవరు కూడా శరణార్థులపై జాలి చూపించకండని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జమ్మూ & కాశ్మీర్ లో రెండు రోజుల క్రితం పర్యాటకులపై ఉగ్రవాద దాడిని నిరసిస్తూ, జనసేన పార్టీ మంగళగిరి లోని CK కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెహల్గాం తీవ్రవాద కాల్పుల్లో చనిపోయిన 26 మంది మృతులకు, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మధుసూదన్ కు పవన్ నివాళి అర్పించారు.

ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కాశ్మీర్ లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు దేశమంతా ఎలా పాకింది చూసామని, అందులో మన జనసైనికుడిని కూడా కోల్పోయామన్నారు.
మధుసూదన రావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే, వారి సతీమణి మాటల్లో చెప్పాలంటే id కార్డ్ చెక్ చేసి మరీ, హిందువులపై దాడి చేశారన్నారు. బొట్టు పెట్టుకున్నందుకు హిందువు అని తన భర్తను చంపేశారని ఆమె తనతో చెప్పినట్లు పవన్ అన్నారు.

కాల్పులు దురదృష్టకరం
పహల్గాం లో చాలా దారుణంగా పర్యాటకులను చంపేశారని, కళ్ళు తెరిచి చూస్తే భర్త రక్తం మధుసూదన రావ్ భార్యపై ఉందన్నారు. విశాఖ చంద్రమౌళి తలపై తూటాల వర్షం కురిపించి చంపేశారని పవన్ అన్నారు. నిరాయుధులపై ఎప్పుడూ ఎవరూ దాడి చెయ్యరు, కానీ పహల్గాం లో పర్యాటకులపై క్రూరంగా దాడి చేసి చంపేశారని, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నన్ని రోజులు కాశ్మీర్ ప్రశాంతంగా ఉండేదన్నారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇలాంటి ఉగ్రవాద ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

తప్పును ఖండించండి
ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా సరే మనకు సంబంధం ఉంటుంది, లేదు అనుకోవద్దు, ఈరోజు ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయింది, అమెరికా కాల్పుల్లో తెలుగు స్టూడెంట్ చనిపోయిన వార్త, కాశ్మీర్ లో ఉగ్రవాద దాడిలో తెలుగు వారి మృతి ఇలా జరుగుతున్నాయి. అందుకే ఎక్కడ ఏ తప్పు జరిగినా ఖండించాలి, ఒకటిగా నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అయినా సరే జాతీయవాదాన్ని బలంగా తీసుకెళ్లాలని, అందుకే నేను తొలినుండి జాతీయవాదాన్ని జనసేన పార్టీ తరపున బలంగా వినిపిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులుగా రాజకీయ చరిత్ర చదవాలి, అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలన్నారు.

ముస్లిం సమాజాన్ని కాదు.. వారిని
ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని చేసిన దాడిని వర్గం మీద జరిగిన దాడిగా మాట్లాడాలన్నారు. ఇక్కడ హిందువులను టార్గెట్ చేసి దాడి చేసినప్పుడు ఎందుకు ఆ విషయం మాట్లాడటానికి కొంతమంది సంకోచిస్తున్నారన్నారు. మన దగ్గర ఉన్న ముస్లిం సమాజాన్ని అనడం లేదు, మతం ముసుగులో ఉన్న ఉగ్రవాదులను అంటున్నట్లు తెలిపారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్ లను తరిమికొట్టారు, ఊచకోత కోశారు. 1986 సమయంలో షూటింగ్ ల కోసం వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది, 1989 సమయంలో దాడులు తీవ్రస్థాయికి వెళ్లాయి. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఎప్పటికీ భారతదేశానిదే, కశ్యప ముని పేరు మీద ఏర్పడిన ప్రాంతం కాశ్మీర్, అమర్ నాథ్ నెలవైన ప్రదేశం, శంకరాచార్య నడిచిన ప్రాంతమని తెలిపారు.

Also Read: AP DSC Notification: డీఎస్సీపై గుడ్ న్యూస్.. 40% మార్కులు చాలు.. మంచి ఛాన్స్!

సహనం వద్దు..
మన దేశానికి సహనం ఎక్కువైంది, మంచితనాన్ని ఆసరాగా తీసుకుని దాడులు చేస్తున్నారు, ఖచ్చితంగా దాడులు అడ్డుకోవాల్సిందేనంటూ పవన్ పిలుపునిచ్చారు. తక్కువ వేతనానికి పనిచేయడానికి బంగ్లాదేశ్ నుండి రోహింగ్యాలు వచ్చి ఇక్కడ పనిచేస్తూ, సంఘ్ విద్రోహక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా ఉంటే వారిపై దృష్టి పెట్టండి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రతీ చర్యకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పవన్ అన్నారు.

కొంతమంది పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నారు
కొంతమంది నాయకులు ఈ ఉగ్రవాద దాడిని కూడా ఖండించకుండా పాకిస్తాన్ ను ప్రేమిస్తాం, హిందువులపై మతం ఆధారంగా దాడి కాదు అని అంటారు, సత్యాన్ని చెప్పడానికి కూడా మీకు రాజకీయాలా? కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ మాటలు మాట్లాడుతున్నారు, మీరు భారతీయులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంటే ఆవిడ నన్ను చూసి, మీరు, భారత ప్రభుత్వం అందరూ నమ్మకం కల్పిస్తేనే కదా కాశ్మీర్ వెళ్ళాం, ఇప్పుడు భర్తను కోల్పోయాను అని చెప్తుంటే తట్టుకోలేకపోయానని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జాలి చూపొద్దు
తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పాల్సిందే, విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ లో హిందువులను సమానంగా చూస్తాం అని చెప్పారు, ఇప్పుడు లక్షల్లో మాత్రమే ఉన్నారు, కానీ భారత్ లో పాకిస్తాన్ లో ఎంతమంది ముస్లిం లు ఉన్నారో అంతమంది ఉన్నారు. భారతదేశం మాత్రమే అన్ని మతాలను సమానంగా చూసిందన్నారు. భారతదేశంలో ఇప్పటికే 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కొత్త శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేదు. ముందు ఉన్న వారి అవసరాలు తీర్చాలి. కాబట్టి ఎవరూ కూడా జాలి చూపించకండి అంటూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. హిందువులకు ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశమని, ఇక్కడ కూడా మనకి రక్షణ లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలన్నారు. చంపింది 26 మందిని అయినా దాని భయం ప్రతీ ఒక్క హిందువుపై ఉంది. మన దేశాన్ని మనం కాపాడుకోవాలన్నారు.

సత్యమే మాట్లాడుతా..
ఓట్ల కోసం అయితే చాలా పార్టీలు ఉన్నాయి కానీ సత్యాన్ని సత్యంగా ధైర్యంగా మాట్లాడేందుకు ఒక పార్టీ కావాలి అని జనసేన స్థాపించానన్నారు. అందుకే ఏ భయం లేకుండా మాట్లాడుతున్నట్లు తెలిపారు. మీ కళ్ళ ముందు ఏ మతంపై దాడి జరిగినా మీరు ఖండించి అడ్డుకోవాలి. సెక్యులరిజం అంటే కేవలం ముస్లిం లేదా, ఇతర మతాల మీద దాడి జరిగినప్పుడే గుర్తొస్తుందా? హిందువులపై దాడి జరిగినప్పుడు గుర్తుకు రాదా? ఏ మతం పై దాడి జరిగినా సరే మనం ఖండించాలని పవన్ అన్నారు. ఇదివరకు లాంటి భారతదేశం కాదు, కొత్త తరహా భారతదేశం. ఉగ్రవాద దాడులు చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోమని పవన్ సీరియస్ అయ్యారు.

Also Read: Prakash Raj: పవన్ కళ్యాణ్‌కు అసలేం తెలియదు.. పుసుక్కున అలా అనేశాడేంటి? వీడియో వైరల్!

నా బిడ్డ భయపడుతున్నాడు.. వారికి రూ. 50 లక్షల సాయం
ప్రాణాలు పోయినా సరే ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ పోరాడుతామని తెలిపారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో మృతిచెందిన క్రియాశీలక జనసైనికుడు మధుసూదన రావు గారి కుటుంబానికి ₹50 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటిస్తున్నాను. ఇది ఆర్ధిక సాయం లా కాకుండా వారి కుటుంబానికి మేమున్నాం అనే భరోసా ఇస్తుందని భావిస్తూ, భవిష్యత్తులో అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో నా కొడుకు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, కింద పడినట్లుగా కలలు వస్తున్నాయని భయపడుతున్నాడని పవన్ అన్నారు. డాక్టర్స్ కి చూపిస్తున్నట్లు, అలాంటిది మధుసూదన రావును తీవ్రవాదులు దారుణంగా కాల్చి చంపుతుంటే చూసిన 10 ఏళ్ల కొడుకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ పవన్ తన ప్రసంగం ముగించారు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?