Farmer ID(image credit:X)
తెలంగాణ

Farmer ID: అన్నదాతకు అండగా ఫార్మర్ రిజిస్ట్రేషన్.. 11 అంకెలతో గుర్తింపు కార్డులు!

Farmer ID: ఇక రైతుల వివరాలు అన్ని ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో ఆన్ లైన్ లో నమోదు చేయనున్నారు. ఆ రైతుకు 11 అంకెలతో గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. కేవలం రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఆ రైతులకు ఫార్మర్ ఐడీ కేటాయిస్తారు. ఇందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వరికోతల నేపథ్యంలో ఆన్ లైన్ నమోదు కార్యక్రమంలో ఆలస్యమవుతున్నట్లు సమాచారం.

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో రైతన్నలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రతి అన్నదాతకు ఆధార్‌ మాదిరి ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ పేరుతో 11 అంకెల సంఖ్యతో గుర్తింపు కార్డులను(ఐడీ కార్డులు) జారీచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.

ఈ పథకం మరింత సమర్థవంతంగా పనిచేయడానికి.. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య చేపట్టింది. దీనిలో భాగంగా.. పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకునే కొత్త రైతులతో పాటు.. వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డును జారీ చేయనుంది. ఈ కార్డు ఆధార్ తరహాలోనే 11 అంకెల సంఖ్యతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పేరుతో ఉంటుంది. ఈ గుర్తింపు కార్డునే ప్రతి రైతుకు తప్పనిసరి అని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Also read: Vaibhav Suryavanshi: రికార్డ్ బ్రేక్ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ .. భారీ సెంచరీతో పరుగుల వర్షం

ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం ఈ నెల 22తోనే ప్రారంభం కావల్సి ఉంది. ఇందుకోసం వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ గురించి అవగాహన కల్పించారు. అయితే రాష్ట్రంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫార్మర్ రిజిస్ట్రీ ని వాయిదా వేసినట్లు సమాచారం. https://tlfr.agristack/gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే అందులో ఫార్మర్ రిజిస్ట్రీ అని వస్తుంది. అందులో రైతు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అందుకు రైతు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్, మొబైల్ నెంబర్ తప్పనిసరి. సంబంధిత వివరాలు నమోదు చేసేటప్పుడు ఓటీపీలు కూడా వస్తాయి.

వాటితోనే వివరాల నమోదు ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను రైతుల ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల రైతుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే క్లిక్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ 11 అంకెల సంఖ్యను ఎంటర్ చేస్తే రైతు పేరు.. వారి స్వగ్రామం, ఏయే సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, ఆ భూమి యొక్క సారం, అందులో పండించగల పంటలు, రైతులకు ఉన్న అప్పుల వివరాలు.. అలాగే పీఎం సమ్మాన్ నిధి.. ఇతర వ్యవసాయ పథకాల ద్వారా పొందిన లబ్ధి వంటి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు.

బ్యాంకు లోన్​ల కోసం అధికారులకు పట్టా పాసు పుస్తకం ఇతర డాక్యుమెంట్లను చూపించాల్సిన అవసరం ఉండదు. రైతుకు జారీచేసినటువంటి గుర్తింపు కార్డును సదరు అధికారికి చెబితే సరిపోతుంది. బ్యాంకు రుణాలు పొందడం కూడా సులభం అవుతుంది. గతంలో రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు పట్టా పాసుపుస్తకం, ఇతర పత్రాలు చూపించాల్సిన అవసరం ఉండేది. ఇకపై రైతులకు జారీ చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు కార్డును బ్యాంకు అధికారులకు చూపిస్తే సరిపోతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు, కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఈ ప్రక్రియ వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతుంది. మరోవైపు వాతావరణ పరిస్థితులను సైతం రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేస్తుంది.

Also read: Hydra Ranganath: లే అవుట్ రూపాన్ని మార్చితే కఠిన చర్యలు.. హైడ్రా హెచ్చరిక!

భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతోనే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేయడం జరుగుతుంది. రెవెన్యూశాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరాలను రైతు ఆధార్ సంఖ్యను ఆనుసంధానం చేయడంతో ఈ ఫార్మర్ ఐడీని కేటాయిస్తారు. కానీ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ద యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ లో ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడీ కేటాయిస్తారు.

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అయిన రైతుభరోసా, రుణమాఫీ తదితర రాష్ట్ర పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం ఉండదు. ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలను నమోదును కేవలం వ్యవసాయాధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారికి మాత్రమే ప్రభుత్వం అప్పగించింది. తప్పులు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది.

 

Just In

01

Komatireddy Venkat Reddy: యువతకు స్కిల్స్ పెంచి, ఉపాధి కల్పించడమే సర్కార్ లక్ష్యం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Bigg Boss Telugu 9: ఇది చదరంగం కాదు.. రణరంగం! బిగ్ బాస్ హౌస్‌లోకి న్యూ సెలబ్రిటీస్!

CPI: సీపీఐ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు సముచిత స్థానం!

Local Body Elections: గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై జోరుగా చర్చ.. రిజర్వేషన్లపై ఆశలు, ఆందోళనలు

ICC Warning: కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ వార్నింగ్.. జరిమానా విధించే ఛాన్స్!