Jagga Reddy on KCR: సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదా?
Jagga Reddy on KCR(image credit:X)
Political News

Jagga Reddy on KCR: సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు!

Jagga Reddy on KCR: కేసీఆర్ మాటకు విలువ లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.  గాంధీభవన్ లో మాట్లాడుతూ.. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించడంతోనే సోనియా గాంధీ ప్రకటించారన్నారు.

ప్రజల పట్ల గాంధీ కుటుంబం ఎప్పుడూ హీరోనే అంటూ కొనియాడారు. సీఎం రేవంత్ కు భయపడి అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడన్నారు. బీఆర్ ఎస్ ఏం చెప్పినా జనాలునమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ పదేళ్లు సీఎంగా పనిచేశారని, ఆ అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించాలంటే అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ప్రజలు ఇచ్చిన బాధ్యతను కూడా సంపూర్ణంగా పూర్తి చేయకపోతే ఎలా? అంటూ నిలదీశారు. కేసీఆర్ తానే తెలంగాణ తెచ్చాననే భ్రమలో ఉన్నారని, దాన్ని నుంచి బయటకు రావాలన్నారు. తెలంగాణ నినాదం నుంచి కేసీఆర్ వెనక్కి పోయే సందర్భంలో టీ కాంగ్రెస్ నేతలు అండగా నిలిచిన విషయం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్నారు.

Also read: TGERC Members: విద్యుత్ రంగంలో సమూల మార్పులు.. ఈఆర్సీ సభ్యులుగా రఘు, శ్రీనివాస రావు!

కాంగ్రెస్ నాయకత్వం లేకుంటే, తెలంగాణ వచ్చేది కాదన్నారు. రాహుల్ ను విమర్శించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, ఒరిస్సా, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు డబ్బులు పంపింది బీఆర్ఎస్సే అంటూ మండిపడ్డారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..