Dimple Hayathi in Sharwa38
ఎంటర్‌టైన్మెంట్

Sharwa38: శర్వా, సంపత్ నంది సినిమాలో మరో హీరోయిన్.. హీటెక్కాల్సిందే!

Sharwa38: చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా38ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమా అటు శర్వానంద్‌కు, ఇటు సంపత్ నందికి.. ఇద్దరికీ ఎంతో కీలకమైన సినిమా. వీరిద్దరికి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. సంపత్ నంది నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. మధ్యలో సాయి దుర్గా తేజ్‌తో చేయాలనుకున్న సినిమా సడెన్‌గా ఆగిపోయిన విషయం తెలిసిందే. మరో వైపు శర్వానంద్‌ నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో సరిగా ఆడిన దాఖలాలు లేవు. అలా ఇద్దరికీ ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించనుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పించనున్నారు.

Also Read- Rithu Chowdary: వైఎస్ జగన్ పేరు ప్రస్తావిస్తూ.. రూ. 700 కోట్ల స్కామ్‌పై రీతూ షాకింగ్ కామెంట్స్!

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, హైబడ్జెట్‌తో పాటు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో షూటింగ్‌ను ప్రారంభించుకోబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆల్రెడీ ఈ చిత్రంలో నటించే ఒక హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించారు. శర్వా పక్కన ఆల్రెడీ ‘శతమానం భవతి’ సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌ను మెయిన్ హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. తాజాగా ఈ మూవీలో నటించే మరో హీరోయిన్‌ పేరును రివీల్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. ఈ భామ గ్లామర్ ట్రీట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇంతకు ముందు చేసిన సినిమాల లిస్ట్ చూస్తేనే అది తెలిసిపోతుంది.

శర్వా38 చిత్రంలో ఒక క్రూషియల్ పాత్ర కోసం డింపుల్ హయాతిని సెలక్ట్ చేసినట్లుగా మేకర్స్ తెలుపుతున్నారు. ఈ భామ ఈ ప్రాజెక్ట్‌లో యాడ్ అవడంతో హీటెక్కించే బ్యూటీని సెలక్ట్ చేశారని అంతా అనుకుంటూ ఉండటం విశేషం. ఈ సినిమా కథలో ఇంపాక్ట్ ఫుల్ క్రూషియాల్ రోల్ కావడంతో వెంటనే డింపుల్ కూడా ఓకే చెప్పిందని అంటున్నారు. కచ్చితంగా ఆమెకు ఈ పాత్ర మంచి గుర్తింపును ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అనుపమ, డింపుల్ ఇద్దరి పాత్రలు ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయట. అనుపమ పోస్టర్ ఒక బోల్డ్ ట్రాన్స్ ఫర్మేషన్‌కు హింట్ ఇస్తే.. డింపుల్ లుక్ ఇంటెన్స్ ఎనర్జీ‌కి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉంది. ఆమె ముఖం కనిపించకపోయినా, మెడ, ముక్కు, చెవులు, చేతులు, వేళ్లపై బంగారు ఆభరణాలతో డింపుల్ సరికొత్తగా కనిపిస్తుంది.

Also Read- Allu Aravind: ఆడవాళ్లను బొద్దింకలతో పోల్చి.. ఫీల్ కావద్దని అంటాడేంటి?

1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన కథతో, హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించనుంది. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?