Google In AP (image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Google In AP: విశాఖలో గూగుల్.. జాబ్స్ వేలల్లో.. మీరు సిద్ధమా!

Google In AP: ఏపీ రాజధాని అమరావతి.. అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. రాజధానిలోని విట్ యూనివర్సిటీ (Vit University)లో నిర్వహిస్తున్న ‘వి లాంచ్ పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్ పో’ (We Launch Pad 2025 – Startup Expo) కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అక్కడ కొత్తగా నిర్మించిన మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి. గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‍ముఖ్ బ్లాక్ నూతన భవనాలను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు అభివృద్ధిలో అమరావతి అన్ స్టాపబుల్ అని కొనియాడారు.

క్వాంటం వ్యాలీకి ఫౌండేషన్
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు హైటెక్ సిటీ (Hitech City)ని నిర్మించినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. తద్వారా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు కాలం మారిందన్న చంద్రబాబు.. అమరావతి లో క్వాంటం వ్యాలీకి (Quantum Vally) ఫౌండేషన్ వేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఐటీ (Information Technology) అన్నప్పుడు ఎవరికీ అర్థం కాలేదన్న చంద్రబాబు.. దాని విలువ ఇప్పుడు అందరికీ తెలుసిందని చెప్పారు. ఇప్పుడు క్వాంటం అంటే ఏంటని అడుగుతున్నారని.. కంప్యూటర్ల కంటే 1000 రెట్లు వేగంగా పనిచేసే కంప్యూటర్ టెక్నాలజీ క్వాంటం అని సీఎం స్పష్టం చేశారు.

Also Read: AP Dwcra Loans: ఏపీలో ఇదేం స్కీమ్.. అడిగినంత డబ్బులు తీసుకోవడమే.. సూపర్ కదా!

త్వరలో విశాఖకు గూగుల్
ఓవైపు అమరావతి అభివృద్ధి చేస్తూనే విశాఖ (Visakhapatnam)కు సైతం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ గూగుల్ కు రాబోతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై రానున్న రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు పేర్కొన్నారు. గూగుల్ ఇక్కడకు వచ్చి ఏఐ ద్వారా అనలటిక్స్ తయారు చేసి ప్రపంచానికి అందజేయనున్నట్లు చెప్పారు. తద్వారా నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అటు వైజాగ్ కు ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ ప్లాంట్‌ (ArcelorMittal Steel Plant) కూడా రాబోతోందని, దేశంలోనే ఎక్కువగా స్టీల్ ఉత్పత్తి వైజాగ్‌లోనే జరగబోతోందని సీఎం అన్నారు.

Also Read This: HC on Group 1: గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. హైకోర్ట్ కు టీజీపీఎస్సీ.. రేపే విచారణ!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!