MLA Veerlapally Shankar(image credit:X)
తెలంగాణ

MLA Veerlapally Shankar: గులాబీల సభ కాదది.. గులాముల సభ.. కాంగ్రెస్ నేత ఫైర్!

MLA Veerlapally Shankar: వరంగల్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ విమర్శించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. కేసిఆర్ వరంగల్ సభా తీరుపై నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ఓ ముసలి నక్క.. కొడుకు కేటీఆర్ డ్రగ్స్ రాజా అని, కూతురు కవిత లిక్కర్ రాణి, అల్లుడు అగ్గిపెట్ట మచ్చ అని విమర్శించారు. వీరందరి రాజకీయ ప్రాబల్యం పెంచేందుకు కెసిఆర్ 14 నెలల తర్వాత భారీ బహిరంగ సభను రజతోత్సవాల పేరిట ఏర్పాటు చేశాడని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్యాసి కేసీఆర్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న ప్రాంతాన్ని అప్పుల కుప్పగా మార్చి కుటుంబ ఆర్థిక ప్రయోజనాలకి పెద్దపీట వేసిన కేసిఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.

సభలో హరిశ్చంద్రుడిలా మాట్లాడిన కేసీఆర్ పదేళ్ల పాలనలో దళిత ముఖ్యమంత్రి హామీ నుండి ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వరకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదని మొత్తం 100 హామీలకు సంబంధించిన చిట్టాను మీడియాకు విడుదల చేశారు. 100 హామీలతో మోసాలు చేసిన కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఏర్పాటు చేశారని సిగ్గు లజ్జ ఉండాలి అంటూ ఘాటుగా విమర్శించారు.

Also read: Silver Jubilee Celebrations: సిల్వర్ జూబ్లీ వేడుకలు.. కానరాని పెద్ద సార్!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ గులాబి పార్టీ గులాముల సభగా ఆయన అభివర్ణించారు. ఏడాది తర్వాత కేవలం జల్సా చేసుకునేందుకు ఏర్పాటుచేసిన సభగా ఆయన విమర్శించారు. రజతోత్సవ సభ ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, కేసీఆర్ సొంత డబ్బా కొట్టుకున్నారని పేర్కొన్నారు. గులాబీ గులాములు బస్సులో నేరుగా పెగ్గులు తాగుతూ మజా చేస్తూ సభకు వెళ్లిన తీరు సోషల్ మీడియాలో అన్ని బట్టబయలు అవుతున్నాయని ఎద్దేవా చేశారు.

కూతురు లిక్కర్ రాణి, కేసీఆర్ మందుబాబు కాబట్టి ఈ విధంగా గులాబీ గులాములకు మందు ఏర్పాటు చేశారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రజా సమస్యలపై భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి సూచనలు సలహాలు లేని సభగా ఆయన కొట్టిపారేశారు.

మాట తప్పిన కేసీఆర్

గత పది ఏళ్లలో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి తప్పారని వీర్లపల్లి శంకర్ గుర్తు చేశారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు చూసి కేసీఆర్ కు కడుపునొప్పి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదు కదా కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఎవరిని చేయలేదని విమర్శించారు.

మూడెకరాల భూమి ఎస్సీ ఎస్టీలకు ఇస్తానని ఇవ్వలేదని, రుణమాఫీ చేస్తానని చేయలేదని కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారని తెలిపారు. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని ఇంటికో ఉద్యోగం కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు.

పదో తరగతి పేపర్ లీక్, దక్షిణ తెలంగాణపై వివక్ష చూపి పాలమూరు ఎత్తిపోతలను కనీస 30% కూడా పూర్తి చేయలేదని లక్ష ఎకరాలకు నిరుస్తానని చెప్పి ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మాణం చేపడతానని పదేళ్లు టైం పాస్ చేశారని అన్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేయని పనులు తను ఎమ్మెల్యే అయ్యాక ఒక్కో పని చేసుకుంటూ వస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు వారి సొంత ఆస్తులు పెంచుకోవడానికి కుటుంబ సభ్యుల వ్యాపారం పెంచుకునేందుకే దందాలు చేశారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఏం చేయలేదని అన్నారు.

కాళేశ్వరం కాస్త కూలిపోయే దశకు చేరుకుందని కోట్లాది రూపాయలు మింగిన పాపానికి చిప్పకూడు తినే రోజులు దగ్గరపడ్డాయని కేసీఆర్ ను హెచ్చరించారు. ఆలీబాబా 40 దొంగలు టీం పట్టుకుని కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ధరణితో రైతులను పచ్చి మోసం చేసిన తీరుపై రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి తీసుకువచ్చారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల వద్ద కోట్లాది రూపాయల కమిషన్ ముందుగానే తీసుకొని వారికి బిల్లులు చెల్లించని దౌర్భాగ్యులని విమర్శించారు. కాంట్రాక్టర్లకు గ్రామాల్లో సర్పంచులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయించిన కేసీఆర్ వారి నెత్తిన శఠగోపం పెట్టారని ఆరోపించారు.

నువ్వు తెలంగాణ జాతిపితవా?

కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్న ఆయన గులాబీ గులాములు వాస్తవాలు తెలుసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. పచ్చి తాగుబోతుగా 24 గంటలు ఫామ్ హౌస్ లోనే గడిపే కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఇలా జాతిపిత అవుతారని ప్రశ్నించారు. కొడుకు రాజా కూతురు లిక్కర్ రాణి అల్లుడు అగ్గి పెట్ట మచ్చా ఇలా ఫ్యామిలీ మొత్తం అనేక అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని తెలంగాణ సమాజాన్ని నాశనం చేసి దోచుకున్న వారు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించారు.

Also read: Kaleshwaram project: ఒక్క ప్రసంగం.. 100 ప్రశ్నలు.. కేసీఆర్ కు కొత్త చిక్కులు!

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి, ప్రొఫెసర్ జయశంకర్ ఇంకా తెలంగాణ కోసం పోరాడిన మేధావులు ఉద్యోగులు కర్షకులు కార్మికులు సకలజనులు ఉన్నారని వారిని మించిన జాతిపిత ఎవరున్నారని ప్రశ్నించారు.

కేసీఆర్ నుండి మొదలుకొని వారి కుటుంబ సభ్యుల ఆస్తులు మాజీ మంత్రుల ఆస్తులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల ఆస్తులు వారు ముందు సమర్పించిన ఫోటో ఆ తర్వాత గత పది ఏళ్ల కాలంలో సంపాదించిన ఆస్తుల అఫిడవిట్లు చూస్తే ప్రజాధనం ఎంత కొల్లగొట్టారో అర్థమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఏడాదిన్నర పాటు ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ను గులాబీ గులాములు జాతిపితగా అభిమానించడం సిగ్గుచేటని విమర్శించారు.

ఉద్యమ పార్టీగా చెప్పుకుంటూ అధికారుల్లోకి రాగానే ఉద్యమాలు చేయకుండా ధర్నా చౌక్ ను ఎత్తివేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఉద్యమాలు చేయకుండా ఇంటి గడప దాటకుండానే అరెస్టులు చేశారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ సభలు నిర్వహిస్తే అడ్డుకున్న చరిత్ర కేసీఆర్ దని అన్నారు.

కేసీఆర్ మతిమరిసిండు

కేసీఆర్ మునుపటిలా లేడని కుటుంబ ప్రతిష్ట పెంచేందుకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును వెంట తెచ్చుకొని చదివాడని కేసీఆర్ మొత్తం మతిమరిచిండనీ శంకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రసంగం సమయంలో టీవీలో కనిపించిందని ప్రసంగించేందుకు తడబాటు పడ్డారని ప్రసంగం నచ్చక సొంత పార్టీ కార్యకర్తలే అల్లరి చేస్తుంటే కేసీఆర్ సహనం కోల్పోయాడని శంకర్ అన్నారు.

25వ రజతోత్సవ సభ పేరిట కేసీఆర్ సాధించింది ఏమీలేదని కోట్లు ఖర్చుపెట్టి రేవంత్ రెడ్డిని తిట్టేందుకు సభ ఏర్పాటు చేసుకున్నారని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు చేసింది ఏమీ లేదని, గులాబీల జల్సాల కోసం సభ ఏర్పాటు చేశారని ఆ సభ కాస్త అట్టర్ ప్లాప్ గా మారిందని ఎమ్మెల్యే అభివర్ణించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు