Sunitha on Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అసలు ఎవరూ ఉహించని విధంగా ఆ అమ్మాయి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read: Mulugu District: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్!
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పినవి విన్న తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో ఇంత జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. అయితే, తాజాగా సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా షో లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ను బయటకు వెల్లడించింది. ప్రస్తుతం, ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Also Read: Singer Pravasthi: ప్రవస్తి చెప్పేదంతా నిజమే.. ఆ డైరెక్టర్ సంచలన కామెంట్స్
సింగర్ ప్రవస్తి మాట్లాడుతూ ” నేను ఫస్ట్ నుంచి నా వ్యకిగత విషయాలను చెప్పిందే లేదు. షో జరుగుతున్న సమయంలో ఒక రోజు శ్రీముఖి అక్క నా దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడూ బాధనంతా నీలోనే పెట్టుకుని ఉంటావ్.. అదంతా స్టేజ్ పైన చెప్పు అన్నారు. అప్పుడు, నేను నేను పడిన కష్టాలు, నా బాధలన్నీ స్టేజ్ పైనే షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మంగ్లీ అక్క నా దగ్గరికి వచ్చి, మేము నీకు సపోర్ట్ చేస్తామని ధైర్యం చెప్పింది ” అంటూ కామెంట్స్ చేసింది. ఈ వివాదంతో సంబందం లేని వీరిద్దరి పేర్లు బయటకు రావడంతో ఈమె వెనుక వీళ్లు ఉన్నారా అనే అనుమానం నెటిజన్స్ కలుగుతుంది.