Fraud In Kurnool district: ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ ఆశ చూపి శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ దాదాపు 100 కోట్లకు పైగా దోచుకుని మోసం చేసింది. ప్రజల నుండి వందల కోట్లు డిపాజిట్ పేరిట సేకరించి బాధితులకు కుచ్చుటోపి పెట్టింది. బాధితుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచలనంగా మారింది.
దేశవ్యాప్తంగా దాదాపు 270 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఘరానా మోసంలో భాగంగా మొదట్లో అరకొర కొందరికి డబ్బులు చెల్లింపు చేశారు. ఇది చూసి ఆకర్షితులైన జనం భారీ ఎత్తున శ్రేయ ఇన్ఫ్రా లో డిపాజిట్లు జమచేశారు.
భారీగా డిపాజిట్లు సేకరించి శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ లిమిటెడ్ 2024 ఎన్నికల సమయంలో అకౌంట్ బ్లాక్ చేసి ఉడాయించగా, కర్నూల్ త్రీ టౌన్ పీఎస్ లో గతంలో బాధితులు ఫిర్యాదు చేశారు. మొదట్లో డిపాజిట్ దారులకు నెలనెలా ఖాతాలో నగదు జమ చేస్తుండడంతో నమ్మిన జనం, రూ.లక్షకు రూ.1.80 లక్షలు చెల్లిస్తామని నమ్మించి శ్రేయ ఇన్ఫ్రా కంపెనీ, కర్నూలు నగరంతో పాటు వామసముద్రం, తడకనపల్లెతో, ఓబులాపురం, నన్నూరు, బైరాపురం, లొద్ది పల్లె , తో పాటు వివిధ గ్రామాలకు చెందిన 500-1000 మంది నుంచి డిపాజిట్లు సేకరించింది.
Also read: Silver Jubilee Celebrations: సిల్వర్ జూబ్లీ వేడుకలు.. కానరాని పెద్ద సార్!
నెలకు 12 వేలు చొప్పున ఇస్తామని చెప్పి 15 నెల నెలలు రూ.1.98 లక్షలు వసూలు చేశారు. నెలకు 11 వేలు చొప్పున 18 నెలలు కడితే లక్ష 98 వేలు చెల్లిస్తామంటూ మరో మాయ చేశారు. ఈ లెక్కన తమ డిపాజిట్ల పై నెలకు 5 రూపాయల పైనే వడ్డీ వస్తుందని దురాశపడిన జనం చివరికి మోసపోయామని తెలుసుకున్నారు.
కర్నూలుకు చెందిన వెంకట సుబ్బారెడ్డి గత ఏడాది నవంబర్ 22 న సంస్థ చైర్మన్ తో పాటు పలువురిపై కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాతాదారుల నుండి ఎన్ ఓ సి లు సేకరించి బాధిత జనానికి డిపాజిట్లు ఇచ్చేలా హెడ్ ఆఫీస్ కు పంపిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంస్థ ఏజెంట్లు, డిపాజిట్ దారులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కొందరు పోలీసులు కూడా ఉన్నట్లు సమాచారం.