Natural Star Nani speech
ఎంటర్‌టైన్మెంట్

Natural Star Nani: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో.. లాస్ట్ పంచ్ భలే ఇచ్చావులే నాని!

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా, కెజియఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేకర్స్ వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలను మరింత పెంచేస్తూనే ఉన్నాయి. మే 1న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో నాని అందరిలో హుషారు నింపారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Serial Actress: ఆ దర్శకుడు ప్రాజెక్ట్ కోసం పిలిచి.. నా దుస్తులను..?

‘‘ప్రేక్షకులందరి ఎనర్జీ మాకు ఎంతో జోష్‌ని ఇచ్చింది. రాజమౌళితో నాకు మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉండేది. నేను నటించిన ప్రతి సినిమాని ఇద్దరం కలిసి ప్రసాద్ ఐమాక్స్‌లో చూసేవాళ్ళం. సినిమా రిజల్ట్, సినిమా ఎలా ఉంది? అని ఆయనని అడిగే తెలుసుకునేవాడిని. ఆయన చెబితే ఇక అంతే. కానీ ఇప్పుడు అటు వైపు వెళ్ళడం లేదు. మే 1న ఆయనకి ఏ పనులు ఉన్నా సరే.. ఆ సెంటిమెంట్‌ని ఈసారి తప్పనివ్వను. ఒకవేళ ఆయనకి ట్రావెల్ ఉంటే ఆయన పాస్ పోర్ట్‌ను నేను లాగేసుకుంటా. రాజమౌళి నా సినిమా చూసి మళ్లీ ఆ ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని ఆయన ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది.

రాజమౌళికి నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అని ఫీల్ అయినట్టుగా చేసిన ఆయన ఫ్యామిలీలోని అందరికీ థ్యాంక్యూ. ఎస్ఎస్ రాజమౌళి పేరు సినిమా డిక్షనరీ‌లోకి వెళ్లిపోయింది. సినిమాల్లో ఏదైనా ఒక రిఫరెన్స్ పాయింట్ మాట్లాడుకున్నప్పుడు రాజమౌళి సినిమా సీన్‌లా ఉండాలి అని అనుకుంటాం. అలాంటి ఒక సీక్వెన్స్ ‘హిట్ 3’ లో వుంది. విశ్వక్సేన్, శేష్ హిట్ వెర్స్‌కి పిల్లర్స్. వాళ్లు బిల్డ్ చేసిన దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తున్నాం. ఈ ఫంక్షన్‌కి వాళ్ళు కూడా వచ్చి ఒక ఫ్యామిలీ వాతావరణాన్ని నింపారు. డైరెక్టర్ శైలేష్ స్ట్రెంత్ నాకు తెలుసు. తనలో ఉన్న స్ట్రెంత్‌ని తను ఇంకా పూర్తిగా ఎక్స్‌పోర్ట్ చేశాడని నేను అనుకోవట్లేదు. తన స్ట్రెంత్ తాలూకా ట్రైలర్‌ని మే 1న చూడబోతున్నారు. సాంకేతిక నిపుణులందరూ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. శ్రీనిధి మృదుల పాత్రని అద్భుతంగా చేసింది. ప్రమోషన్స్‌లో కూడా తన సొంత సినిమా లాగా పాల్గొంటుంది. మిగతా టీమ్‌లో ఇప్పుడే థ్యాంక్స్ చెప్పలేని పేర్లు కొన్ని ఉన్నాయి. రిలీజ్ తర్వాత వాళ్ల గురించి చెప్తాను.

Also Read- Singer Pravasthi: ప్రవస్తి చెప్పేదంతా నిజమే.. ఆ డైరెక్టర్ సంచలన కామెంట్స్

సినిమా బాగుండాలి.. మన అందరి లైఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. మే 1న అందరం సినిమాని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా మీద ఉన్న ప్రేమని మరొకసారి చూపించబోతున్నాం. ఆ ప్రేమని ఇంకొక్కసారి గట్టిగా దేశం మొత్తం వినిపించేలాగా చూపిద్దాం. ఒక కమర్షియల్ మాస్, థ్రిల్లర్ కలిస్తే ఎలా ఉంటుందో ‘హిట్3’లో చూస్తారు. చాలా రేర్ కాంబినేషన్ అది. ఉదయం స్వామి వారి దర్శనం జరిగింది. ఐదు నిమిషాలు దేవుడు ముందు నిలబడ్డాను. ఇంతకు ముందు ఎప్పుడూ అలా జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్‌లో సినిమా చూశాను. మే 1న అందరికీ ఒక అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తానని మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు.

నా వెనక రాజమౌళి ఉన్నారు. నా ముందు మీరు ఉన్నారు. మీరంతా చూపిస్తున్న ప్రేమ నా గుండెల్లో ఉంది. కడుపులో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. పవన్ కళ్యాణ్ స్టైల్‌లో చెప్పాలంటే ‘మనల్ని ఎవడ్రా ఆపేది’.. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ‘హిట్ 3’ టీమ్ అందరికీ థాంక్యూ. మే 1న వస్తున్న సినిమాలు అన్నీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక లాస్ట్ పంచ్‌గా నాని చెప్పిన పవన్ కళ్యాణ్ డైలాగ్.. ఈవెంట్‌కి వచ్చిన అందరిలో హుషారుని నింపింది. నాని ఆ డైలాగ్ చెప్పగానే 2 నిమిషాల పాటు స్టేడియం అంతా ఈలలు, గోలలతో హోరెత్తింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు