Naveena Bole
ఎంటర్‌టైన్మెంట్

Serial Actress: ఆ దర్శకుడు ప్రాజెక్ట్ కోసం పిలిచి.. నా దుస్తులను..?

Serial Actress: ప్రతి రంగంలో లైంగిక వేధింపులు ఉంటాయని ఈ మధ్య ఏ నటిని కదిలించినా చెబుతూనే ఉన్నారు. ఒక్క సినిమా రంగం మాత్రమే కాదు, ఇతర రంగాలలో కూడా ఆడవాళ్లపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయని, వీటికి అడ్డుకట్ట వేయడం అంత సామాన్యమైన విషయం కాదని ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ నటి పేర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మ్యానేజ్ చేసుకోవాలి.. లేదంటే ఎన్నో కోరికలతో ఇండస్ట్రీలోకి వచ్చే వారు భయపడిపోతారని ఆ నటి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అయితే ఇతర రంగాలలో లైంగిక వేధింపుల సంగతి ఏమో కానీ.. సినిమా, టీవీ రంగాలలో మాత్రం రోజుకో వార్త అన్నట్లుగా ఏదో ఒక చోట, ఎవరో ఒక నటి.. వారు ఫేస్ చేసిన విషయాలను ధైర్యంగా బయటపెడుతున్నారు.

Also Read- King Nagarjuna: నాగ్ సార్.. మీరు తయారు చేసిన ఉగ్రవాదులు వీరే.. రివీల్ చేసిన నా అన్వేష్!

తాజాగా హిందీ సీరియల్ నటి నవీనా బోలే.. తన విషయంలో ఓ దర్శకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, తన తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరనుకున్నారా? బాలీవుడ్ సంచలన దర్శకుడు సాజిద్ ఖాన్. అవును ఒక ప్రాజెక్ట్ నిమిత్తం తనని పిలిచిన దర్శకుడు సాజిద్ ఖాన్.. తన దుస్తులు తొలగించాలని చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఆమె అనే కాదు.. మహిళల పట్ల ఆయన ప్రవర్తన అలాగే ఉండేదని ఆ తర్వాత తెలిసిందని, నవీనా బోలే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

‘‘టీవీ సీరియల్స్‌లో నటిగా చేస్తున్న నాకు 2004-05 టైమ్‌లో ఓ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు సాజిద్ ఖాన్ నుంచి పిలుపొచ్చింది. అప్పటికే ఆయన పేరు బాగా వినిపించేది. అలాంటి దర్శకుడి నుంచి నాకు కాల్ రావడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను. కానీ ఆయన దగ్గరకు వెళ్లిన తర్వాత.. ఎందుకు వచ్చానా? అని ఎంతో బాధపడ్డాను. ఆయన నిజ స్వరూపం ఏమిటో, ఆడవాళ్ల పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు అప్పుడర్థమైంది. ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలని పిలిచి, నన్ను దుస్తులు తొలగించి పక్కన కూర్చోమన్నాడు. నాకు ఆయన చెప్పిన మాటలు ఫస్ట్ అర్థం కాలేదు. చాలా సేపటికి కానీ ఆయన మాటల్లోని మర్మం నాకు తెలిసింది.

Also Read- Samantha: మాతాజీగా సమంత.. సీరియల్స్ దెయ్యాలను వదిలిస్తుందా?

వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కోసం వేరే వారు కింద వెయిట్ చేస్తున్నారని, వెంటనే వెళ్లాలని, మళ్లీ వస్తాను అని చెప్పి.. ఆయన గది నుంచి ఎలాగోలా బయటికి వచ్చేశా. నేను బయటికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. వస్తున్నావా? ఇప్పుడు ఎక్కడున్నావు? అంటూ మెసేజ్‌లు పంపిస్తూ వచ్చాడు. కానీ నేను మాత్రం అస్సలు స్పందించలేదు. మళ్లీ ఇంకోసారి ఆయనని కలవకూడదని డిసైడ్ అయ్యాను. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్‌లో పెట్టేశాను’’ అంటూ సాజిద్‌పై నటి నవీనా బోలే సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ మాటలు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఎవరినీ నమ్మడానికి లేదు, పైకి కనిపించేంత మంచి వారు కాదు.. ఈ దర్శకులు అన్నట్లుగా కొందరు నవీనా బోలే ఆరోపణలపై రియాక్ట్ అవుతున్నారు. మరి సాజిద్ ఖాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!