Sekhar Master ( Image Source: Twitter )
ఎంటర్‌టైన్మెంట్

Sekhar Master: ఆమెతో నాకు లింక్ పెట్టారు.. ఎంకరేజ్ చేస్తా.. శేఖర్ మాస్టర్ కామెంట్స్

Sekhar Master: స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరో వైపు టీవీ షోలతో ఫుల్ బిజీ అయ్యారు. రియల్ లైఫ్ లో తను చూసిన స్ట్రగుల్స్ వలనే ఈ రోజు ఇలా ఉన్నాను అంటూ పలు సందర్భాల్లో చెప్పారు. ఇటీవల ఢీ డ్యాన్స్ షోలో మీరు జాను లిరి అనే అమ్మాయిపైన స్పెషల్ ఇంట్రెస్ట్ చుపించారంటూ, ఆ అమ్మాయిని అదే పనిగా పొగడటం, ఆ అమ్మయి ఆ షోలో విన్ అయ్యేలా శేఖర్ మాస్టర్ చేసారంటూ ఎన్నో పుకార్లు వచ్చాయి.

జాను లిరి కంటే ఇంకా బాగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారని, ఆమెనే ఎందుకు విన్ అయ్యేలా చేసారంటూ శేఖర్ మాస్టర్ తో లింక్ పెట్టి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసారు. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పై వచ్చిన ఈ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చారు.

Also Read: Hebah Patel: రాజ్ తరుణ్ అలాంటి వాడే.. ఆ సమయంలో చాలా ఏడ్చాను.. హెబ్బా పటేల్ కామెంట్స్

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ” జనాలు ఒకర్ని బ్యాడ్ చేయాలని ఫిక్స్ అయితే ఎలా అయిన చేస్తారు. నేను ఆ సీట్ లో కూర్చున్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఎవరైనా బాగా చేస్తే మెచ్చుకోవాలి, బాగా చేసావ్ అని ప్రతి ఒక్కరికి చెబుతాము. ఆ అమ్మాయి నార్మల్ డ్యాన్స్ లు చేసేది. అలాంటి ఆమె స్టేజి పైకి వచ్చి డాన్స్ చేస్తుంటే బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ సీజన్ లో తన డ్యాన్స్ బాగా నచ్చింది. నేను జాను జాను అంటుంటే .. ఆమెకి నాకు ఏదో రిలేషన్ ఉన్నట్టు ఎన్నో వార్తలు ” రాశారని అన్నారు.

Also Read: Rain Alert in Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం

ఇంకా మాట్లాడుతూ ” ట్యాలెంట్ ఉంటే ఆమెనే కాదు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాం, దానిని తప్పుబడితే ఎలా? ఆ సీజన్ మొత్తం మీద అందరికంటే బాగా చేసింది. ఆమెకు టాలెంట్ ఉంది. విన్ అయింది. నేనేదో కావాలని ఆమెను గెలిపించా అంటూ రూమర్స్ వచ్చాయి. నేను కూడా ఎక్కడికి వెళ్లినా ఆమెతో ఎఫైర్ పెట్టి అడుగుతున్నారు. అసలు ఆమెతో నాకు పోలిక ఏంటి? ఇలా మా ఇద్దరి మీద ఇంస్టాగ్రామ్ లో పోస్టులు పెట్టి షేర్ చేశారు. దీని వల్ల నేను చాలా సఫర్ అయ్యానని, నాకు ఆమెకి రిలేషన్ ఉందని, ఇంకా ఏవేవో చెబుతున్నారు. ఆమెకు ఫ్యామిలీ ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు. చాలా బాధేసింది ఆ టైం లో అని ఎమోషనల్ అయ్యారు. ఇలా చేస్తే వాళ్లకు ఏమొస్తుందో నాకు అర్ధం కావడం లేదని ” అన్నారు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!