Hebah Patel: హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాల్లో కూడా కనిపించడం లేదు. టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్‌గా పాపులర్ అయిన హెబ్బా, గత కొంతకాలంగా ఏ సినిమాల్లో కనిపించింది లేదు. స్టార్ హీరోలతో అవకాశాలు తెచ్చుకునే వరకు ఈమె కెరీర్ వెళ్ళింది లేదు. అయితే, రీసెంట్ గా ‘ఓదెల-2’ లో నటించి తన మార్కును చూపించింది. వాస్తవానికి ఈ చిత్రంలో తమన్నా కన్నా మంచి మార్కులు వేపించుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన లవ్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: Rain Alert in Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో వర్షం కురిసే అవకాశం
మీరు సినీ ఇండస్ట్రీలో ఎవరితో కంఫర్ట్ గా ఉంటారు అని యాంకర్ అడగగా, తాను ఏం ఆలోచించకుండా వెంటనే రాజ్ తరుణ్ పేరు చెప్పింది. హెబ్బా పటేల్ మాట్లాడుతూ ” తనతో నేను చాలా హ్యాపీగా ఉంటాను.. ఫ్రీగా నాలాగా నేను ఉంటాను. నాకు ఎక్కువ తెలుగు రాదు. కానీ, తను చాలా సపోర్ట్ చేసాడు. తనతో క్యూట్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి అంటూ మంచిగా చెప్పుకొచ్చింది. ఓ వైపు రాజ్ తరుణ్ గురించి ఎన్నో వార్తలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
Also Read: CM Chandrababu: ఫిషింగ్ హార్బర్ కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు.. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు!
మీరు ఎవరి నైన లవ్ చేసారా అని అడగగా.. ” హ చేశాను , బట్ అది నాతో ఎక్కువ కాలం లేదు. నాది లవ్ ఫెయిల్యూర్.. నా లవ్ బ్రేకప్ అయినప్పుడు చాలా చాలా ఏడ్చాను. నాలో నేను కుమిలిపోయాను. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. చాలా సమయం పట్టింది బయటకు రావడానికి. ఇండస్ట్రీ వాళ్ళు కాదు.. అతను బయటి వాళ్ళు అని చెబుతూ ఎమోషనల్ అయ్యి షాకింగ్ కామెంట్స్ చేసింది.