Nani and Rajamouli
ఎంటర్‌టైన్మెంట్

SS Rajamouli: హిట్ మెషిన్ అని రాజమౌళి ఎవరిని పిలుస్తారో తెలుసా?

SS Rajamouli: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘కెజియఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (KGF Fame Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ఎటువంటి అంచనాలను ఏర్పడేలా చేశాయో తెలియంది కాదు. మే 1న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ‘హిట్’ ఫ్రాంచైజీలో ఇంతకు ముందు వచ్చిన రెండు చిత్రాలలో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్, అడవి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయం చెప్పారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Hit 3: నాని సినిమాకు ఏపీలో టికెట్ల ధరలు పెరిగాయ్.. మరి తెలంగాణలో!

‘‘నాని చాలా బాగా మాట్లాడి నేను ఎమోషనల్ అయ్యేలా చేసేశాడు. థాంక్యూ నాని. సినిమా ఇండస్ట్రీలో మేమంతా ప్రశాంతి తిపిర్నేనిని హిట్ మిషన్ అని పిలుస్తుంటాము. ఎందుకంటే వైవిధ్యమైన చిత్రాలతో తను 100 శాతం సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన నిర్మాత. ఐదో సినిమాగా వస్తున్న ‘హిట్ 3’ చిత్రం మే 1న విడుదలై కంటిన్యూస్ అదే సక్సెస్ ట్రాక్‌లోకి వెళ్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అందులో ఎటువంటి డౌట్ లేదు.

మొన్న ‘హిట్ 3’ టీమ్ ఇంటర్వ్యూ చూస్తున్నాను. సినిమాకి సంబంధించి ఏదైనా చిన్న విషయం బయటికి లీక్ అయినప్పుడు చాలా కోపం వస్తుంది. కానీ శైలేష్ చాలా కూల్‌గా, ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాట్లాడిన విధానం నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ ఇంటర్వ్యూ చూశాక తనపై నాకు గౌరవం ఏర్పడింది. చాలా మంది ఫ్రాంచైజీలు క్రియేట్ చేస్తారు. కానీ అవి ఎంతకాలం ఉంటాయో, ఎన్ని సక్సెస్‌లు అవుతాయో తెలియదు. కానీ శైలేష్ ‘హిట్ ఫస్ట్ కేసు’ అని క్రియేట్ చేసిన వెంటనే. తర్వాత సెకండ్ కేస్, థర్డ్ కేస్.. ఇలా అనంతంగా ఉంటాయి కదా ఆటోమేటిగ్గా థాట్ వస్తుంది. తనకున్న ఆలోచనలు ఏడే కావచ్చు. కానీ హిట్ ఫ్రాంచైజీ‌లో అంతకంటే ఎక్కువగా సినిమాలు వస్తాయని నమ్ముతున్నాను.

Also Read- Serial Actress: ఆ దర్శకుడు ప్రాజెక్ట్ కోసం పిలిచి.. నా దుస్తులను..?

నాని ఈ మధ్య ఏ సినిమా చేసినా హిట్ రిజల్టే వస్తుంది. తన నుంచి ఇంకా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ప్రజంట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని కంటే నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు. అయినా నాని విషయంలో నా ఆశ తీరదు. నాని ఇంకా ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని ఆల్రెడీ క్రియేట్ చేశాయి. మే1న ఓన్లీ ఇన్ థియేటర్స్. ఆప్ కీ బార్ అర్జున్ సర్కార్. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్..’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Ganesh Immersion 2025: పాతబస్తీ గణనాధులపై స్పెషల్ ఫోకస్.. మంత్రి పొన్నం, డీజీపీ, మేయర్ విజయలక్ష్మి ఏరియల్ సర్వే