Natural Star Nani in Hit 3
ఎంటర్‌టైన్మెంట్

Hit 3: నాని సినిమాకు ఏపీలో టికెట్ల ధరలు పెరిగాయ్.. మరి తెలంగాణలో!

Hit 3: భారీ బడ్జెట్ సినిమాలకు, కాస్త పేరున్న హీరోల సినిమాలకు విడుదల సమయంలో టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదలైనప్పుడు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి లేదంటూ ప్రభుత్వం ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏ హీరో సినిమా విడుదలైనా నార్మల్ టికెట్ల ధరలకే సినిమాలు ఆడించాలి. అలాగే బెనిఫిట్ షో లేదు కానీ, ఎక్స్‌ట్రా ఒక షోకి మాత్రం అనుమతి ఉంది.

Also Read- Serial Actress: ఆ దర్శకుడు ప్రాజెక్ట్ కోసం పిలిచి.. నా దుస్తులను..?

ఏపీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. కాస్త పేరున్న సినిమా, హీరో ఎవరైనా సరే.. ప్రభుత్వాన్ని కలిసి, సినిమాకు చాలా ఖర్చు అయ్యిందని చెబుతూ టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరితే చాలు, వెంటనే అనుమతులు వచ్చేస్తున్నాయి. కారణం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన సినిమా వాడు కావడం, గత ప్రభుత్వం ఆయన సినిమాలను ఇబ్బంది పెట్టిన తీరు.. అన్ని దృష్టిలో పెట్టుకుని.. సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టవద్దంటూ, వాళ్లు అడిగినవి సమకూర్చాలని సినిమాటోగ్రఫీ మంత్రికి ఆయన ఆర్డర్ వేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు ఎవరైనా సరే, టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పిస్తూ వస్తుంది.

ఇప్పుడు నేచురల్ స్టార్ నాని వంతు వచ్చింది. ఆయన హీరోగా నటించిన ‘HIT: ది థర్డ్ కేస్’ చిత్రం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఏపీలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించగా, అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 75 పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో మాత్రం ఈ సినిమా నార్మల్ రేట్లకే ప్రదర్శితమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకటించిన తర్వాత, సినిమా వాళ్లు ఎవరూ టికెట్ల హైక్, బెనిఫిట్ షోల గురించి ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదనే విషయం తెలిసిందే.

Also Read- King Nagarjuna: నాగ్ సార్.. మీరు తయారు చేసిన ఉగ్రవాదులు వీరే.. రివీల్ చేసిన నా అన్వేష్!

ఇక ఏపీ విషయానికి వస్తే.. గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు, నాని సినిమాలకు కూడా అన్యాయం జరిగింది. వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ల ధరలపై పవన్ కళ్యాణ్, నాని మాత్రమే అప్పట్లో రియాక్ట్ అయ్యారు. అలాగే ఎన్నికల సమయంలో జనసేనకు నాని పూర్తి మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. మరి అలాంటి హీరో ఏపీలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించమని అడిగితే, ప్రభుత్వం అంగీకరించకుండా ఎలా ఉంటుంది? ఎలాగూ ఏపీలో సినిమా వాళ్లకు స్వేచ్ఛ ఉంది. నానికి ఈ పాయింట్ కూడా యాడ్ అయింది కాబట్టి.. ఆయన సినిమాకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి సహకారాన్ని అయినా అందిస్తుందని.. నాని అభిమానులు సైతం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!