King Nagarjuna: కింగ్ నాగార్జునకు, ఉగ్రవాదులకు సంబంధం ఉన్నట్లుగా నా అన్వేషణ అన్వేష్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జున వ్యవహరిస్తూ.. తిండికి తిఖానా లేని వాళ్లని హౌస్‌లోకి తీసుకెళ్లి, వారికి స్టార్‌డమ్ వచ్చేలా చేసి పంపిస్తున్నారనేలా నా అన్వేష్ ఆరోపణలు చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి స్టార్‌డమ్‌తో బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ ఉగ్రవాదులకు చెందిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ.. బీభత్సంగా సంపాదించి, లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తున్నారని, అసలు గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో మీకు తెలియడం లేదంటూ నాగార్జునపై ప్రశ్నల వర్షం కురిపించారు నా అన్వేష్. తాజాగా ఆయన బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున తయారు చేసిన ఉగ్రవాదులు వీరే నంటూ మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన చెబుతున్న ఉగ్రవాదుల పేర్లు, ఫేస్‌లు కూడా రివీల్ చేయడం విశేషం. ఈ వీడియోలో..
Also Read- Suriya: అలాంటి టాటూలు వేసుకోవడాన్ని నేను అంగీకరించను.. చిరంజీవే స్ఫూర్తి!
‘‘నాగార్జునగారూ.. మీరు తయారు చేసిన ఉగ్రవాదులను చూడండి.. అంటూ బిగ్ బాస్ కొంపలో బెట్టింగ్ మాఫియా పేరుతో ఓ పిక్చర్ చూపించాడు. టేక్స్ చెప్పుకుంటూ మొదలైన ఈ మూవీలో.. యాక్షన్ చెప్పగానే, కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ఈసారి బిగ్‌బాస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి, ఫన్‌కి, టర్న్‌లకి, ట్విస్ట్‌లకి లిమిటే లేదు అని చెప్పి.. అందులో కంటెస్టెంట్స్‌గా హాజరైన లేడీస్ అందరి మధ్యలో నాగార్జున నిలబడి ఉన్నట్లుగా ఓ ఫొటోని డిజైన్ చేశారు.
ఇక బిగ్ బాస్ షో టైమ్ చెప్పినట్టుగా ఉదయం 8 గంటలకు అని చెప్పగానే అందులోని కంటెస్టెంట్ ఒకరు బెట్టింగ్ యాప్ ప్రొమోట్ చేస్తున్నట్లుగా వీడియో ప్లే అవుతుంది. అలా విష్ణుప్రియ, దీప్తి సునయన, భానుశ్రీ, సిరి హనుమంతు, దివి, శోభా శెట్టి, అలైఖ్య హారిక, ప్రియాంకా జైన్, అషు రెడ్డి, శ్రీ సత్య, యాంకర్ స్రవంతి, శుభశ్రీ, శివజ్యోతి, శ్రీముఖి, నైనీ పావనీ, నైనిక, అమర్ దీప్ అండ్ అతని భార్య, సొహైల్, టేస్టీ తేజ, రైతు బిడ్డ ప్రశాంత్, షణ్ముఖ్ షన్ను, ఆర్‌జె సూర్య, యావర్, సందీప్, ఇంకా బిగ్ బాస్‌లోని ఇతర కంటెస్టెంట్స్ ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారో వారందరి ఫొటో పెట్టి.. వీళ్లే మీరు తయారు చేసిన పత్తిత్తులు, పత్తిగింజలు వీరే’’ అంటూ నా అన్వేష్ ఈ వీడియోలో పేర్కొన్నారు.
Also Read- King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!
దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అన్వేష్‌కు మద్దతుగా నిలుస్తుంటే, కింగ్ నాగార్జునని ఇంకోసారి ఏమైనా అంటే.. నీ సంగతి చూస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఒక నెటిజన్ చేసిన కామెంట్ అయితే.. అన్వేష్‌కు జాగ్రత్తలు చెబుతున్నట్లుగా ఉంది. ఆ కామెంట్‌లో.. ‘‘మంచి చేస్తున్నావ్.. నీకు మేము కామెంట్స్ పెట్టి సహాయం చేయగలం కానీ డైరెక్టుగా ఎలాంటి సహాయం చేయలేము. ఏదైనా చెడు జరిగితే మాత్రం మొత్తం నువ్వే భరించవలసి ఉంటుంది. అప్పుడు మేము కనీసం కామెంట్స్ రూపంలో కూడా సహాయం చేయకుండా తప్పించుకుంటాం. మొత్తంగా అయితే రిస్క్ అంతా నీదే. నువ్వుమాత్రం నీ ఎదుగుదలకి నా వ్యూయర్సే కారణం అని చెప్పుకుంటావ్. నువ్వు కల్మషం లేని పిచ్చొడివి. నీ ఫ్యాన్స్ కోసం అవసరమైతే చచ్చిపోతావ్. కానీ చాలా దుర్మార్గపు లోకం.. ఒంటరిగా పోరాడుతున్నావ్. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని రాశారు. ప్రస్తుతం అన్వేష్ నుంచి వచ్చిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు