Suriya at Retro Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Suriya: అలాంటి టాటూలు వేసుకోవడాన్ని నేను అంగీకరించను.. చిరంజీవే స్ఫూర్తి!

Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ (Retro) చిత్రం మే 1న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించింది. శనివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక (Retro Pre Release Event)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు వెంకీ అట్లూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత నాగవంశీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్య ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరికీ కనిపించవ్!

టాటూలు కాదు.. మీ జీవితంపై దృష్టి పెట్టండి
‘‘ముందుగా పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack)లో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారీ నష్టాన్నే మిగుల్చుతుంది. ఇలాంటి ఘటనలు అసలు జరగకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ‘రెట్రో’ మూవీ అందరినీ 90 దశకానికి తీసుకెళుతుంది. 1992-95 టైమ్‌లో నేను కామర్స్‌ డిగ్రీ చదువుతున్నాను. ఆ రోజుల్లోకి వెళ్లడమంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక అడ్వెంచరస్ జర్నీ కనిపిస్తుంది. మన హిస్టరీ ఒకసారి నెమరేసుకోవచ్చు. నటులుగా మేము ఈ రోజు ఈ స్థాయిలో, స్థానంలో ఉన్నామంటే.. అందుకు కారణం ప్రేక్షకులే. వారు చూపించే ప్రేమాభిమానాలే మాకు శ్రీరామరక్ష. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. వారి చేతులపై నా పేర్లు ఉన్న టాటూలు చూస్తుంటే.. ఎంతగా నన్ను ప్రేమిస్తారో అర్థమవుతోంది. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. అలాంటి టాటూలు వేసుకోవడాన్ని నేను అంగీకరించను. నాకు ఇష్టం ఉండదు. ముందు ప్రతి ఒక్కరూ మీ జీవితంపై దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరికీ అందమైన జీవితం ఉంది. మీరు చేసే పనిని ముందు ప్రేమించడం నేర్చుకోండి.

Also Read- Yamudu: యమపాశంతో బ్యూటీని కట్టి పడేసిన ‘యముడు’.. కొత్త పోస్టర్ చూశారా!

వెంకీ అట్లూరి (Venky Atluri) తో సినిమా
కార్తీక్ సుబ్బరాజ్‌తో చేసిన ఈ ‘రెట్రో’ చిత్రం మే 1న థియేటర్లలోకి వస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. మే 1న వస్తున్న నాని ‘హిట్ 3’ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు గెస్ట్‌లుగా వచ్చిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నాగవంశీ, వెంకీ అట్లూరి అందరికీ ధన్యవాదాలు. విజయ్ జర్నీ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మేమందరం ఒక కుటుంబంలా ఉంటాం. విజయ్ ‘కింగ్‌డమ్’ సినిమాకు ఆల్ ది బెస్ట్. ఓటమి లేకుండా విజయం ఉండదు. కాకపోతే ఓటమికి కృంగిపోకుండా, తిరిగి నిలబడటానికి ప్రయత్నించాలి. బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్టు కాదు.. మేము కూడా అంతే. కచ్చితంగా మళ్లీ పంచ్ ఇస్తాం. నా తదుపరి సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంటుంది. వెంకీ అట్లూరి దర్శకుడు. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది.

మెగాస్టారే స్ఫూర్తి
విజయ్ ‘అగరం’ ఫౌండేషన్ గురించి మాట్లాడాడు. ‘అగరం’ ఫౌండేషన్ స్థాపించడానికి స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్, తద్వారా జరిగే సేవలు చూసిన తర్వాతే నాకు ఆ ఆలోచన వచ్చింది. అందుకు ధైర్యం ఇచ్చింది మెగాస్టారే. అగరం ఫౌండేషన్ ద్వారా దాదాపు 8 వేల మంది డిగ్రీలు పొందారు. ఈ ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఫండ్ రైజింగ్ కోసమని అమెరికా వెళితే, అక్కడి తెలుగు కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు 30 శాతానికి పైగా ఫండ్‌ని అందించారు. ఇప్పటికీ వారు సాయం చేస్తూనే ఉన్నారు. వారి ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరిచిపోను.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!