Peddapalli Collector : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష సతీమణి విజయ నిన్న రాత్రి డెలివరీ అయింది. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఈ కాన్పులో రెండవ కొడుకు కు విజయ జన్మనిచ్చింది. కాగా తల్లి కొడుకు సురక్షితంగా ఉన్నారని స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ పేర్కొన్నారు.
కలెక్టర్ సతీమణి సాఫ్ట్ వేర్ అయినప్పటికీ మొదటి నుంచి గోదావరిఖని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్ సింగ్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ తో పాటు ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో కలెక్టర్ సతీమణి చికిత్స నిమిత్తం ఆస్పత్రి ఇక్కడికే వస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని విభాగాల వైద్యులు, శస్త్రచికిత్స కు అవసరమైన అధునాతన పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలందిస్తుందని తెలిపారు.
Also read: Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల అరుదైన ఘనత.. ఏమిటంటే!
ఈ క్రమంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. ఏకంగా జిల్లా కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందడం పట్ల అందరికి ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.