Pahalgam Terror attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి దేశంలో విషాదాన్ని నింపింది పర్యాటకులనే టార్గెట్ చేస్తూ వారిపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది మృతి చెందారు. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై ఆకంక్షలు విధించింది. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ కు వెళ్లే సింధు జలాలను క్లోజ్ చేసింది.
Also Read: NVSS Prabhakar: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బీజేపీ నేత పహల్ గావ్ దాడిని గుర్తు చేస్తూ హెచ్చరిక!
అసలే అక్కడి ప్రజలు నీటి కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ సమయంలో భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. నీటి సరఫరా నిలిపి వేయడాన్ని పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. నీటిని నిలిపి వేస్తే రక్తం పారుతుంది, ఇలా చేస్తే ఇక జరిగేది యుద్ధమే అంటూ మండిపడింది. మన వాళ్లు సరదాగా కుటుంబ సభ్యులతో గడుపుదామని కశ్మీర్ వెళ్తే.. టైం చూసుకుని దాడి చేసి కాల్పులు జరిపారు. ఇప్పటికే మన వాళ్ళ మీద ఎన్నో సార్లు ఉగ్రవాదులు దాడి చేశారు. ఓపిక నశించిన ఇండియా పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే, గత కొద్దిరోజుల నుంచి నీరు లేకపోవటంతో పాకిస్తాన్‌లోని ఎన్నో చాలా ప్రాంతాల్లో కరువు ఏర్పడింది. తాగడానికి కూడా నీళ్లు లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు.
ప్రస్తుతం, పాకిస్తాన్ లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకాయి. ఏది కొనాలన్నా పెరిగిన రేట్లు చూసి జనాలు షాక్ అవుతున్నారు. ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ ధర రూ. 140 గా ఉంది. ఇక లీటర్ పాలు అయితే రూ. 110 గా ఉంది. తినే రొట్టెలు అయితే రూ. 500 గా ఉంది. ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందో అంటూ అక్కడి జనాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు