Singer kousalya: నాకు అవకాశాలు రాకుండా తొక్కేశారు .. సింగర్ కౌసల్య షాకింగ్ కామెంట్స్
Singer kousalya ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Singer kousalya: నాకు అవకాశాలు రాకుండా తొక్కేశారు .. సింగర్ కౌసల్య షాకింగ్ కామెంట్స్

Singer kousalya: సీనియర్ సింగర్ కౌశల్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. రవితేజ నటించిన అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో జుమ్ జుమారే పాట పాడింది. పాటను కాలంలో కూడా వింటూ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. ఆమె సినీ కెరియర్లో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి , మణిశర్మ, అనూప్ రూబెన్స్ తో పాడింది. దాదాపు స్టార్ హీరోల అన్ని సినిమాల్లో పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఏమైందో తెలియదు గత కొన్నేళ్ల నుంచి ఆమె నుంచి ఒక్క పాట కూడా రాలేదు. ఇటీవలే ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తెలుగు ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read:  Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో.. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తోంది?

సింగర్ కౌసల్య మాట్లాడుతూనేను కనపడగానే అందరూ ఫస్ట్ నన్ను అడిగే మాట కౌసల్య గారు ఏమైపోయారు ? ఎలా ఉన్నారు ? అసలు కనిపించడం లేదు? మీ పాట వినిపించడం లేదేంటి? అని అడుగుతున్నారు. వాళ్లు అలా అడుగుతుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఎంతో అభిమానంతో మాట అడుగుతారు. కానీ, నాకు కూడా లోపల అదే ప్రశ్న ఉంది. నాకు అవకాశం ఇవ్వనిదే వెళ్లి పాడలేను. అవకాశాలైతే నాకు పదేళ్ల నుంచి చాలా తగ్గాయి. ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయన, తుపాకీ రాముడు లో నా చివరి పాట పాడింది. తర్వాత, ఒక్క పా కూడా పాడలేదుఅని చెప్పింది.

Also Read: Modi and Chandrababu: అమరావతి పునఃప్రారంభం.. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం

ఆమె ఇంకా మాట్లాడుతూతెలుగులో చాలా మంది సింగర్స్ ఉన్నారు. రియాలిటీ షో స్ తో సింగింగ్ ఇండీస్ట్రీకి ఎంతో మంది పరిచయమయ్యారు. వాళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయి. నాకు తెలిసి వాళ్లు తక్కువ పేమెంట్ కి పాడి ఉండొచ్చు. నేను కూడా కాలం నాటి సింగర్ అయి అంటే ఒక్క పాట కూడా వచ్చేది కాదు? ఎందుకంటే బయట పరిస్థితులు అలాగే ఉన్నాయి. నేను అప్పట్లో పాడాను కాబట్టి నాకు కొంచం పేరు వచ్చింది. అయినా కూడా పదేళ్ల నుంచి నాకు అవకాశం ఇవ్వకుండా తొక్కేశారు. కాదు సినీ ఇండస్ట్రీ నన్ను ఎలిమినేట్ చేసిందిఅంటూ చాలా ఎమోషనల్ అవుతూ చెప్పింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..