NC24: యువసామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) కు ఒకప్పుడు ఎప్పుడు హిట్ వస్తుందా? అని అక్కినేని ఫ్యాన్స్ (Akkineni Fans) అనుకునేవారు. కానీ ఇప్పుడు నాగ చైతన్య సెలక్ట్ చేసుకుంటున్న స్ర్కిప్ట్‌లు చూస్తుంటే.. ఇక ఆయనకు విజయాలకు తిరుగులేదు అని అనిపిస్తుంది. ఆల్రెడీ, ఇటీవల వచ్చిన ‘తండేల్’ (Thandel)తో సంచలన విజయాన్ని అందుకున్న చైతూ.. ఆ సినిమా తర్వాత మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. బోల్డ్ ఛాయిసెస్, డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టే చైతూ.. తొలి సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’తో తిరుగులేని విజయాన్ని అందుకుని, రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన విజనరీ దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) తో కొలబరేట్ అవుతున్నారు.
Also Read- JVAS: మెగాస్టార్ ఐకానిక్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే?
ఈ సినిమాకు సంబంధించి చైతూ ఆల్రెడీ కొన్ని విషయాలు లీక్ చేశారు కూడా. చైతూ లీక్స్ పేరుతో ఆ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఆ వీడియా అలా ఉండగానే మేకర్స్ ఇప్పుడు ఓ గూస్ బంప్స్ తెప్పించే వీడియోను వదిలి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో చూస్తుంటే.. చైతూ, కార్తీక్.. ఇద్దరూ కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్‌ని ప్రేక్షకులకు ఇవ్వబోతున్నారనేది అర్థమవుతోంది. NC24 ఈ జోనర్‌ని రీడిఫైన్ చేసే సినిమాటిక్ వండర్ అవుతుందని జస్ట్ ఒక్క వీడియోతోనే మాట్లాడుకునేలా చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ముందు తెరవెనుక ఏమేం జరుగుతుందో తెలిపేలా ‘NC24 – ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్’ పేరుతో ఎలక్ట్రిఫైయింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సంవత్సరాల తరబడి ఆలోచనల, నెలల తరబడి ఇంటెన్స్ ప్రీ-ప్రొడక్షన్ వర్క్, రోజుల తరబడి కఠినమైన రిహార్సల్స్.. ఇవన్నీ కూడా ఈ సినిమాటిక్ వండర్‌కు ప్రాణం పోసే హార్డ్ వర్క్ చిహ్నాలు చూపించారు. అత్యద్భుతమైన సెట్స్‌ని ఇందులో క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. వీడియో మొత్తం కళ్లు తిప్పుకోనివ్వకుండా గూస్‌బంస్స్ తెప్పించే సన్నివేశాలతో నింపేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
Also Read- King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!
అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నీల్ డి కున్హా డీవోపీగా, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లోనే ఒక మైలురాయి మూవీగా నిలుస్తుందని, సినిమా టైటిల్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. అయితే, చైతూ లీక్స్ వీడియోలో ఈ సినిమా టైటిల్ కూడా లీకయింది. ఈ సినిమాకు ‘వృష కర్మ’ అనే టైటిల్‌ని ఫిక్సయినట్లుగా తెలుస్తుంది. ఇక చైతూ లీక్ చేసిన విషయాలన్నీ.. శనివారం విడుదలైన వీడియోలో ఉండటం విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు