Yamudu Poster
ఎంటర్‌టైన్మెంట్

Yamudu: యమపాశంతో బ్యూటీని కట్టి పడేసిన ‘యముడు’.. కొత్త పోస్టర్ చూశారా!

Yamudu: కొన్ని పోస్టర్ చూడగానే సినిమాపై పాజిటివ్ వైబ్‌ని కలగజేస్తాయి. టీజర్, ట్రైలర్ కంటే ముందు వచ్చే పోస్టర్స్ కూడా సినిమాపై ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే మేకర్స్ ప్రత్యేకంగా ఆ పోస్టర్స్‌ని డిజైన్ చేయిస్తుంటారు. ఇప్పుడలాంటి ఓ పోస్టరే టాలీవుడ్ సర్కిల్స్‌లో ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలకు ఈ మధ్య ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్‌ ఏర్పడిందో తెలుస్తూనే ఉంది. అందుకే ఇప్పుడంతా ఆ జోనర్‌లో సినిమాలు చేసేందుకు చిన్న, పెద్ద హీరోలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి (Jagadeesh Aamanchi) హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ కూడా పోస్టర్స్‌తోనే అంచనాలను పెంచేస్తుంది. ఈ సినిమాకు ధర్మో రక్షతి రక్షితః అనేది ఉప శీర్షిక.

Also Read- JVAS: మెగాస్టార్ ఐకానిక్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ ఏంటంటే?

జగదీష్ ఆమంచి సరసన శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అప్డేట్‌ తెలుపుతూ మేకర్స్ న్యూ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఇంతకు ముందు వచ్చిన ‘యముడు’ టైటిల్ పోస్టర్, దీపావళి స్పెషల్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్నట్లుగానే ఇప్పుడు వచ్చిన పోస్టర్ కూడా సినిమాపై క్యూరియాసిటీ కలగజేస్తుంది. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో హీరో జగదీష్ అందరినీ భయపెట్టించేస్తున్నారు. యముడు వెనకాల ఉన్న మహిషాకారం, యముడి చేతికి ఉన్న సంకెళ్లు.. ఇలా అన్నీ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. కొత్తదనం నిండిన కథతో ఈ సినిమా వస్తున్నట్లుగా హింట్ ఇస్తుండటం విశేషం.

ఇంకా ఈ పోస్టర్‌లో హీరోయిన్‌ను యమపాశంతో కట్టి పడేసిన తీరు, యముడి ఆహార్యంలో హీరో కనిపిస్తున్న విధానం.. అంతా కూడా, చూసిన వెంటనే వావ్ అనేలా చేస్తున్నాయి. పోస్టర్స్‌తోనే ఈ మూవీ జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమాలో ఏ కొంచెం కంటెంట్ ఉన్నా, ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కడో పెడతారనడంలో డౌటే లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుందని మేకర్స్ ఈ అప్డేట్‌తో తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని అన్నారు.

Also Read- King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!

ఈ సందర్భంగా చిత్ర దర్శకహీరో మాట్లాడుతూ.. మా సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ అన్నింటికీ చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వదిలిన న్యూ పోస్టర్ కూడా చాలా మంచి స్పందనను రాబట్టుకుంటుంది. సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. మైథలాజికల్ టచ్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను. త్వరలోనే చిత్ర ప్రమోషన్స్ స్టార్ట్ చేసి, విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?