CM Chandrababu ( image credit: twitter)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: ఫిషింగ్ హార్బర్ కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు.. మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు!

 CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెంలో మత్య్సకారులతో ముఖాముఖి అయ్యారు. మొదట పోలేష్, రామలక్ష్మీ దంపతులతో మాట్లాడారు. పోలేష్ మాట్లాడుతూ…. గ్రామంలో 600 కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, సముద్రంలో అలల ఉధృతి సమయంలో బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నామని సీఎంకు వివరించారు.

ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే వేటకు సులభతరం అవ్వడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని సీఎంకు వివరించారు. గత ప్రభుత్వంలో వలలు, మోటార్లు వంటివేమీ మత్స్యాకారులకు అందించలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. మీ సమస్యలు నేరుగా వినేందుకు బుడగట్లపాలెం వచ్చానని, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో అడిగి తెలుసుకోవడానికే వచ్చానన్నారు.

మత్య్సకారుల సేవలో పథకంలో భాగంగా రూ.20 వేలు ఆర్ధిక సాయంగా వేట నిషేధ సమయంలో ఇస్తున్నామని, మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది లేకుండా వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ప్రతి చదువుకునే బిడ్డకు ఇస్తామన్నారు. త్వరలోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 Also Read : Karregutta: శాంతి చర్చల ద్వారానే సామాజిక సవరణలు సాధ్యం.. ప్రొఫెసర్ హరగోపాల్!

ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి, ఇతర వసతులు కల్పిస్తాం : సీఎం

అనంతరం మరో మత్య్సకార బృందం వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు… కారి రాంబాబు, సీతోగ్య, ఎర్రయ్యతో మాట్లాడారు. అర్థరాత్రి పూట వేటకు వెళ్తామని, తిరిగి సురక్షితంగా వస్తామో, రామో కూడా తెలియని పరిస్థితి అని మత్య్సకారులు వివరించారు. పట్టుకున్న చేపలు తీసుకొచ్చుకునేందుకు అవసరమైన సామాగ్రి, బాక్సులు కూడా లేవని, చిన్న పడవ కావడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.

ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తే తమతో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు కూడా ఉపాధి పొందుతారని మత్య్సకారులు వివరించారు. బోట్లు అద్దెకు తీసుకున్న వారికే చేపలు విక్రయించడం వల్ల పడ్డ కష్టానికి ఫలితం దక్కడం లేదని అన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మార్కెట్ ఏర్పాటవుతుందని అన్నారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ… ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసి, ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఇతర అవకాశాలు కల్పిస్తే ఎంతమేర ఆదాయం పెరుగుతందని ప్రశ్నించగా… ఇప్పుడు వచ్చేదానికంటే అదనంగా 50 శాతం వస్తుందని మత్య్సకారులు బదులిచ్చారు. మత్య్సకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉన్నారని, అందుకే మీకోసం ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతున్నామని అన్నారు. ఒక ముఖ్యమంత్రి తమ గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని మత్స్యకారులు సీఎంతో అన్నారు.

 Also Read: Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో.. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తోంది?

ఆప్యాయంగా పలకరింపు

అనంతరం ఎండుచేపల వ్యాపారులు లక్ష్మమ్మ, సీతమ్మ, పైడమ్మ వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఏమ్మా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. చేపలు ఎండబెట్టే విధానం, రోజువారీ ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత కమ్యూనిటీ హాల్‌కు చేరుకున్న సీఎం… చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు