Private Bankers Fraud: పల్లెటూరి అమాయక, నిరక్షరాస్య ప్రజలను ఆసరా చేసుకుని బ్యాంకు లోన్లు ఇస్తామంటూ కొన్ని ప్రైవేటు బ్యాంకు దళారులు మోసగిస్తున్నారు. పల్లె గ్రామాల్లోకి చేరుకున్న ఈ కేటుగాళ్లు గ్రామాల్లో ఉన్న యువత, గృహినీలను ఆసరా చేసుకుని వారి ఆధార్ కార్డులు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్లను సిబిల్ చెక్ చేస్తామంటూ తీసుకుంటున్నారు.
సిబిల్ సరిగా లేదని పల్లెటూరి ప్రజలకు చెప్పి ఒక్కొక్కరి పేరిట రూ.10 లక్షల వరకు తీసుకొని లబ్ధిదారులకు మాత్రం రూ.రెండు, రూ.మూడు లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇదే విషయమై కొంతమంది ఇచ్చిన సమాచారంతో వరంగల్ ఇంటిలిజెన్సీ అధికారులకు చేరినట్లుగా సమాచారం.
ఇదే విషయమై ఇంటిలిజెన్సీ అధికారులు మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం తో పాటు మరికొన్ని మండలాల్లో మోసపోయిన లబ్ధిదారుల జాబితా నివేదిక తయారు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మోసాల్లో దాదాపు లబ్ధిదారులకు తెలియకుండా రూ.రెండు కోట్ల వరకు ప్రైవేట్ బ్యాంకు కేటుగాళ్లు మోసానికి పాల్పడినట్లు సమాచారం.
Also read: Hyderabad: భర్త అక్రమ సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఎక్కడంటే!
తమ పేరు మీద తీసుకున్న డబ్బులు తమకే ఇవ్వాల్సి ఉండగా ప్రైవేట్ బ్యాంకుల నుంచి వచ్చిన దళారులు డబ్బులను కాజేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహా మోసాలకు చాలా రకాల ప్రైవేట్ బ్యాంకు దళారులు గ్రామాల్లో సంచరిస్తున్నట్లుగా సమాచారం.
సిబిల్ చెక్ చేస్తామంటూ ఆధార్ పాన్ బ్యాంక్ అకౌంట్ లను తీసుకొని లబ్ధిదారులకు వచ్చే బ్యాంకు లోన్లను ఖాళీ చేసేందుకు ప్రణాళికలు సైతం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై జిల్లావ్యాప్తంగా ఇంటిలిజెన్సీ నిఘవర్గాల అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం